Citadel Season 2 | గ్లోబల్ స్పైగా ప్రియాంక చోప్రా.. ఉత్కంఠ రేపుతున్న ‘సిటాడెల్ 2’ ట్రైలర్!
Citadel Season 2 | గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ నటుడు రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ సిరీస్ 'సిటాడెల్' రెండో సీజన్‌కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.
Citadel Season 2 | గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ నటుడు రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ సిరీస్ ‘సిటాడెల్’ రెండో సీజన్‌కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్ అధికారిక ట్రైలర్‌ను విడుదల చేస్తూ.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఈ సిరీస్‌ను మే 06 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రాబోతోంది.
ఈ రెండో సీజన్ ట్రైలర్ గమనిస్తే.. ఫస్ట్ పార్ట్ కంటే ఇందులో మరింత యాక్షన్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. నాడియా సిన్ (ప్రియాంక), మేసన్ కేన్ (రిచర్డ్) మరియు బెర్నార్డ్ ఓర్లిక్ (స్టాన్లీ టుచి) తమ గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూనే, సిటాడెల్ సంస్థను నాశనం చేసిన క్రూరమైన ‘మాంటికోర్’ నెట్వర్క్ నుంచి ప్రపంచాన్ని రక్షించే భారీ మిషన్‌లో తలపడబోతున్నారు. హాలీవుడ్ ప్రముఖులు జాక్ రేనర్, మ్యాట్ బెర్రీ వంటి వారు కొత్తగా ఈ సీజన్లో భాగం కాగా, రూసో బ్రదర్స్ నిర్మాణ విలువలు ఈ సిరీస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రస్తుతం రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్లో ప్రియాంక చోప్రా బిజీగా ఉన్నప్పటికీ, ఆమె తన గ్లోబల్ ప్రాజెక్ట్ ‘సిటాడెల్’తో అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటడానికి సిద్ధమైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

