ఇదొక కలర్‌ఫుల్ సినిమా
ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. గెహనా సిప్పీ నాయికగా నటిస్తున్నది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించారు. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పిస్తున్నది. ఈనెల 24న సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ…‘నా స్నేహితుడి నిర్మాణంలో సినిమా రూపొందించడం సంతోషంగా ఉంది. ఇది కలర్‌ఫుల్ సినిమా. ప్రేక్షకులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి’ అన్నారు. ‘దర్శకుడు జీవన్ రెడ్డి నాకు చిరకాల మిత్రుడు.
ఆయన మంచి కమర్షియల్ సినిమాలు చేయాలని కోరుకునేవాడిని. ఈ చిత్రంతో నా కోరిక నెరవేరింది’ అన్నారు నిర్మాత వీఎస్ రాజు. హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ…‘యూవీ క్రియేషన్స్ సంస్థ మా చిత్రానికి ప్రెజెంటర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉంది. తొలి పాట విడుదల నుంచి ఇటీవల ట్రైలర్ రిలీజ్ వరకు మా చిత్రానికి సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. కుటుంబంతో వచ్చి చూడాల్సిన సినిమా ఇది. మీ ఆదరణ కావాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత కాసర్ల శ్యామ్, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రాఫర్ జగదీశ్ తదితర చిత్రబృందం పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

