ప్రేక్షకుల స్పందన బాగుంది
ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెకించిన సినిమా ‘చోర్ బజార్’. ఈ చిత్రాన్ని ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. తాజాగా చిత్ర సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ…‘మాస్ హీరోగా మెప్పించాననే పేరు ఈ సినిమాతో నాకు దకింది. నేను జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను అనే ప్రశంసలు దకుతున్నాయి. ఆ ఘనత దర్శకుడు జీవన్ రెడ్డికి ఇవ్వాలి. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోంది. ఫైట్ మాస్టర్ పృథ్వీ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు. నా గత రెండు చిత్రాల కన్నా ఈ సినిమా గ్రాండ్‌గా ఉందని చెబుతున్నారు. ఈ చిత్రంతో అందమైన జ్ఞాపకాలు దక్కాయి’ అన్నారు. దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘ఒక కలర్ ఫుల్ కమర్షియల్ సినిమా చేయాలన్న మా ప్రయత్నం విజయవంతమైంది. అన్ని కేంద్రాల నుంచి మంచి స్పందన వస్తున్నది. నేను తొలిసారి ఒక మాస్ సినిమా చేశాను. ఆకాష్‌తో పాటు మిగతా టీమ్ అంతా నాకెంతో సపోర్ట్ చేశారు’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వీఎస్ రాజు, సహ నిర్మాత సురేష్ వర్మ, గీత రచయిత మిట్టపల్లి సురేందర్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

