Chiyaan Vikram | ‘మహాన్’ సీక్వెల్ రానుందా?.. చియాన్ విక్రమ్ పోస్టుపై సినీవర్గాల్లో చర్చ
ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు ఆసక్తిని కనబరిచే అతి కొద్దిమంది దక్షిణాది నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. సేతు, శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ.. ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో అలరించాయన.
Chiyaan Vikram | ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు ఆసక్తిని కనబరిచే అతి కొద్దిమంది దక్షిణాది నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. సేతు, శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ.. ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో అలరించాయన. విక్రమ్ నటించిన ‘తంగలాన్’ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. పారంజిత్ దర్శకుడు. ఇదిలావుంటే.. రీసెంట్గా సోషల్‌మీడియాలో విక్రమ్ పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన నటించిన ‘మహాన్’ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు స్టిల్స్ షేర్ చేస్తూ ‘మహాన్2’ అని క్యాప్షన్ పెట్టారాయన.
దాంతో.. విక్రమ్ సరదాగా పెట్టారా? లేక సీరియస్‌గానే ‘మహాన్’ సీక్వెల్ రానుందా? అనేది ఇప్పుడు సినీవర్గాల్లో పెద్ద చర్చగా మారింది. అభిమానుల నుండి కూడా ఊహించని స్పందన రావడం విశేషం. ‘ఈ సారైనా థియేటర్లలో విడుదల చేయండి’ అంటూ ఓ అభిమాని, ‘మేం వెయిటింగ్’ అంటూ మరో అభిమాని ఇలా లెక్కకు మించిన కామెంట్లు. నిజానికి రెండేళ్ల క్రితం విడుదలైన ‘మహాన్’ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. చాలాకాలం తర్వాత విక్రమ్‌కి పెద్ద హిట్‌గా నిలిచిందా సినిమా. పైగా అందులో విక్రమ్ తనయుడు ధృవ్ కూడా కీలక పాత్ర పోషించడం విశేషం. ఇంతకీ ‘మహాన్2’లో నిజమెంత? అనేది త్వరలో తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

