‘గాడ్ ఫాదర్ విజయానికి నాదీ పూచీ’
ఇటీవల ఆచార్య సినిమాతో మిమ్మల్ని మెప్పించలేకపోయాననే బాధ నాలో ఉంది. కానీ ఈ గాడ్ ఫాదర్ తో ఆకట్టుకుంటా. ఈ చిత్రవిజయానికి నాదీ పూచీ’ అన్నారు స్టార్ హీరో చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం అనంతపురంలో జరిగింది.
ఇటీవల ఆచార్య సినిమాతో మిమ్మల్ని మెప్పించలేకపోయాననే బాధ నాలో ఉంది. కానీ ఈ గాడ్ ఫాదర్ తో ఆకట్టుకుంటా. ఈ చిత్రవిజయానికి నాదీ పూచీ’ అన్నారు స్టార్ హీరో చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం అనంతపురంలో జరిగింది. ఇందులో నయనతార నాయికగా నటిస్తుండగా బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సత్యదేవ్, సునీల్, సముద్రఖని ఇతర క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు.
దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా విడుదలవుతున్నది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి మట్లాడుతూ…’నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా వర్షం పడుతుంది. ఇవాళ మా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో వర్షం పడటం ఆ భగవంతుడి ఆశీర్వాదమే అనుకుంటున్నా. గాడ్ ఫాదర్ సినిమా నేను చేయడానికి కారణం రామ్ చరణ్. చరణ్ లూసీఫర్ సినిమా చూసి నాన్నా..ఇప్పుడు నీకున్న ఇమేజ్ కి ఈ సినిమా చేస్తే బాగుంటుంది అన్నాడు. అలాగే దర్శకుడిగా మోహన్ రాజా ఈ సబ్జెక్ట్ బాగా డీల్ చేయగలడు అని సూచించాడు. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది.
జయాపజయాలు అందరికీ సహజమే. గత చిత్రంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయానే అనే బాధ నాలో ఉంది. ఈ సినిమాతో ఆ బాధ తీరిపోతుంది. గాడ్ ఫాదర్ సినిమా మీ అందరినీ మెప్పిస్తుంది. ఈ సినిమా విజయానికి నాదీ పూచీ. నటీనటులు, సాంకేతిక నిపుణులు చక్కగా కుదిరారు. నాకు సపోర్ట్ గా ఉండే పాత్రలో సల్మాన్ ఖాన్ మెప్పిస్తాడు. చరణ్ అడగగానే సల్మాన్ కథ కూడా వినకుండా నటించేందుకు ఒప్పుకున్నాడు. నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ, సునీల్ ఇలా ప్రతి పాత్ర మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మూల కథలో సంగీతానికి ఎలాంటి ఆస్కారం లేదు. అయినా థమన్ దీన్నో మ్యూజికల్ మూవీగా మార్చాడు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ అదిరిపోతాయి. విజయదశమికి హిట్ చిత్రంతో కలుద్దాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

