God Father Movie | చిరు అభిమానులకు మెగా ట్రీట్.. ‘గాడ్‌ఫాదర్’ టీజర్ డేట్ వచ్చేసింది..!
God Father Teaser Date Announced | ఫలితంతో సంబంధంలేకుండా చిరు ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నాడు . ఇటీవలే ‘ఆచార్య’తో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న.. సినిమాల వేగాన్ని మాత్రం తగ్గించడం లేదు. ఈయన సహ నటులు ఒకటి రెండు సినిమాలను లైన్లో పెడితే ఈయన మాత్రం నాలుగైదు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అప్పట్లో చిరంజీవికి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘గాడ్‌ఫాదర్’ ఒకటి. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసీఫర్’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మొహన్‌రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు.
మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీజర్ అప్డేట్ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. గాడ్‌ఫాదర్ టీజర్‌ను ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో చిరు బ్లాక్ గ్లాసెస్ ధరించి క్లాస్ లుక్‌లో ఉన్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన మెగాస్టార్ ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్, ఆర్.బి.చౌదరి, ప్రసాద్ ఎన్వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సల్మాన్‌ఖాన్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా సత్యదేవ్, నయనతార కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Make way for Megastar @KChiruTweets 🔥
Mightier than ever ❤️🔥
Fearsome than ever ❤️🔥#GodFather Teaser on August 21st 💥💥@BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @AlwaysRamCharan @ProducerNVP @SuperGoodFilms_ @KonidelaPro @saregamasouth pic.twitter.com/DnMqi14GFj— Konidela Pro Company (@KonidelaPro) August 18, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

