హీరో చిరంజీవి నటిస్తున్న సినిమా ‘గాడ్ ఫాదర్’. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజకీయ నేపథ్య కథతో దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార నాయికగా నటిస్తుండగా..బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి కనిపించే పాట చిత్రీకరణ ముంబైలో జరుగుతున్నది. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు. ‘సల్మాన్ ఖాన్‌తో కలిసి డాన్సులు చేయడం సంతోషంగా ఉంది. ప్రభుదేవా బెస్ట్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట సినిమాలో ఐ ఫీస్ట్‌లా ఉంటుంది’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.