Chiranjeevi | విజయవంతమైన హీరోగా నిలిచానంటే సురేఖనే కారణం : చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి మహిళలపై ప్రశంసలు కురిపించారు. ప్రతి మగాడి విజయం వెనుకాల స్త్రీ శక్తి ఉంటుందని ప్రశంసలతో ముంచెత్తారు. మహిళ వంటింటికే పరిమితం కాకుండా.. అంతరిక్షంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు.
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి మహిళలపై ప్రశంసలు కురిపించారు. ప్రతి మగాడి విజయం వెనుకాల స్త్రీ శక్తి ఉంటుందని ప్రశంసలతో ముంచెత్తారు. మహిళ వంటింటికే పరిమితం కాకుండా.. అంతరిక్షంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. విజయవంతమైన హీరోగా నిలవడానికి తన భార్య సురేఖనే కారణమని చిరంజీవి ఆమెను కీర్తించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సినీ పరిశ్రమకు చెందిన మహిళా కార్మికులకు చీరలు పెట్టి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి భార్య సురేఖ, ఆయన సోదరితో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. అమ్మ వల్లే స్త్రీ పక్షపాతిగా మారాను అని చెప్పాడు. స్త్రీ పక్షపాతిగా మారడానికి మరోకారణం సురేఖ అని వెల్లడించాడు. నేను విజయవంత మైన హీరోగా నిలవడానికి సురేఖనే ప్రధాన కారణం. ఇంట్లో నా భాద్యత మొత్తం సురేఖనే తీసుకుంది. దాంతో నా సినిమాలపై దృష్టి పెట్టగలిగాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సురేఖను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అంటూ చిరంజీవి కొనియాడాడు.
మహిళలు చంద్రమండలం, ఒలింపిక్స్ స్థాయికి ఎదుగుతున్నారు. మహిళలు ఉన్నత స్థాయికి ఎదగడం గొప్ప విషయం. మహిళల సాధికారత కోసం అందరూ కృషి చేయాలి. ప్రపంచం గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలంటూ స్త్రీల గొప్పతన్నాన్ని వెల్లడించాడు. సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం నటించిన ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటుగా మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

