సోషియో ఫాంటసీకి రెడీ
అగ్ర హీరో చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో అభిమానులు చిరంజీవి తదుపరి సినిమా ఎప్పుడు సెట్స్మీదకెళ్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అగ్ర హీరో చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో అభిమానులు చిరంజీవి తదుపరి సినిమా ఎప్పుడు సెట్స్మీదకెళ్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి ఓ చిత్రానికి అంగీకరించారని కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో భారీ గ్రాఫిక్స్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం నవంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టనున్నట్లు తెలిసింది. సుదీర్ఘ విరామం తర్వాత చిరంజీవి నటించబోతున్న సోషియో ఫాంటసీ చిత్రమిదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం. ఈ సినిమాతో పాటు మలయాళ ‘బ్రో డాడీ’ రీమేక్‌లో చిరంజీవి నటించబోతున్నారు. కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులను జరుపుకుంటున్నదని తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

