యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ ఉపశీర్షిక. అరుణ్ భారతి ఎల్ దర్శకుడు. సూపర్‌గుడ్ ఫిల్మ్స్ పతాకంపై వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించారు. తాజాగా ఈ సినిమాలోని ‘నీ కోసం’ అనే పాట విడుదలైంది. మెలోడీ ప్రధానంగా సాగే ఈ గీతాన్ని కశ్మీర్‌లోని సుందరమైన లొకేషన్లలో చిత్రీకరించారు. ప్రేమికుల ఎడబాటుని తెలియజెపుతూ ఈ పాట హృద్యంగా సాగింది.
కృష్ణచైతన్య సాహిత్యాన్నందించారు. మనసును తడిమే భావోద్వేగాలున్న ప్రేమకథా చిత్రమిదని, తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని దర్శకుడు తెలిపారు. డిసెంబర్ 9 ఈ చిత్రం విడుదలకానుంది. సత్య, పృథ్వీ, మురళీశర్మ, సునీల్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.పి, సంగీతం: అస్లాంకీ, సంభాషణలు: విజయ్, సమర్పణ: ఆర్.బి.చౌదరి, రచన-దర్శకత్వం: అరుణ్‌భారతి ఎల్.