వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘చెడ్డీ గ్యాంగ్ తమాషా’. గాయత్రి పటేల్ నాయిక. సీహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాత. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను హాస్యనటుడు బ్రహ్మానందం విడుదల చేశారు. నిర్మాత క్రాంతి కిరణ్ మాట్లాడుతూ…‘అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా సినిమా ఉంటుంది.
ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. హీరో వెంకట్ కళ్యాణ్ మాట్లాడుతూ…‘పల్లె ప్రజలను పీడిస్తున్న ఊరి పెద్దను విప్లవ భావాలున్న ఓ యువకుడు ఎలా ఎదిరించాడు అనేది ఈ చిత్ర కథాంశం. దీన్ని ఎంటర్టైనింగ్గా తెరకెక్కించాం.’ అన్నారు.