Chaurya Paatam | అమెజాన్ ప్రైమ్‌లో ‘చౌర్య పాఠం’ నయా రికార్డ్.. 200 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్
Chaurya Paatam Amazon Prime | ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ‘చౌర్య పాఠం’ సినిమా పేరు మార్మోగిపోతోంది. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో సరికొత్త సంచలనం సృష్టిస్తూ, ఏకంగా 200 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయిని అవలీలగా దాటేసింది.
Chaurya Paatam Amazon Prime | ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ‘చౌర్య పాఠం’ సినిమా పేరు మార్మోగిపోతోంది. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో సరికొత్త సంచలనం సృష్టిస్తూ, ఏకంగా 200 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయిని అవలీలగా దాటేసింది. డిజిటల్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న ‘చౌర్య పాఠం’, థియేటర్లలో నిశ్శబ్దంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతూ, డిజిటల్ స్క్రీన్లను షేక్ చేస్తోంది.
ఈ చిత్రానికి స్టార్ల హంగామా గానీ, భారీ సెట్టింగుల ఆర్భాటం గానీ లేవు. అయినా, కేవలం తన కథతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇంతలా ప్రేక్షకాదరణ దక్కడానికి ప్రధాన కారణాలు… కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి సాహసోపేతమైన దర్శకత్వం, కథలోని పచ్చి నిజాయితీ, మరియు నటీనటుల అద్భుతమైన సహజ నటన. ముఖ్యంగా, ఈ చిత్రంలో వేదాంత్ రామ్ పాత్రలో కనిపించిన ఇంద్ర రామ్, తన తొలి సినిమా అయినా అనుభవజ్ఞుడైన నటుడిలా అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు.
సినిమాలో ఇంద్ర రామ్ తన మొదటి సినిమాను నిర్మించాలనే తీవ్రమైన ఆకాంక్షతో, నిధుల కోసం ధనపల్లి అనే గ్రామంలోని బ్యాంకును దోచుకోవడానికి ఒక చిన్న ముఠాతో కలిసి పథకం వేసే దర్శకుడిగా కనిపించారు. ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పేరులో ‘చౌర్యం’ (దొంగతనం) అని ఉన్నప్పటికీ, సినిమా చూశాక కలిగే అనుభూతి మాత్రం వేరే స్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు చెబుతున్నారు. దొంగతనం చుట్టూ తిరిగే కథే అయినా, నిజాయితీ, ధైర్యం, మానవ సంబంధాలలోని సున్నితమైన అంశాలను స్పృశిస్తూ, ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటుంది.
‘చౌర్య పాఠం’ కేవలం ఒక సినిమాగా మిగిలిపోకుండా, ఓటీటీ వేదికపై ఒక జీవం ఉన్న చర్చాంశంగా మారింది. సింపుల్‌గా కనిపించే కథలో లోతైన భావోద్వేగాలను చూపించడమే ఈ సినిమా ప్రత్యేకత. నక్కిన నరేటివ్స్ బ్యానర్‌పై త్రినాధరావు నక్కిన, వి. చూడామణి నిర్మించిన ఈ చిత్రం, తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలై, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా సంగీతం కూడా ఒక ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఇంకా ఈ సినిమాను చూడని వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

