అలనాడు గ్లామర్ నాయికగా తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది సిల్క్‌స్మిత. 80, 90 దశకాల్లో ఓ వెలుగువెలిగింది. శనివారం సిల్క్‌స్మిత జయంతిని పురస్కరించుకొని ఆమె బయోపిక్‌ను ప్రకటించారు. ‘ది అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సిల్క్‌స్మిత పాత్రను చంద్రిక రవి పోషించనున్నారు. ఎస్టీఆర్ఐ సినిమాస్ పతాకంపై ఎస్. బి.విజయ్ నిర్మించబోతున్నారు.
శనివారం విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్లో సిల్క్‌స్మిత ట్రేడ్ మార్క్ పోజ్‌లో చంద్రిక రవి ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: వి.మహాస్త్రీ అమృతరాజ్, రచన-దర్శకత్వం: జయరామ్.