డా.పి.యష్మన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘చంద్రప్పన్’. సోనాలీ కథానాయిక. ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈచిత్రం జూలై 24న థియేట్రికల్ రిలీజ్ కానున్నది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు వి.సముద్ర, నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
దర్శకనిర్మాత, హీరో డా.పి.యష్మన్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు నచ్చే కంటెంట్‌తో ఈ సినిమా చేశాం. మంచి కాస్టింగ్ ఈ మూవీలో ఉన్నది. అన్ని వర్గాలనూ ఆకట్టుకునే సినిమా అవుతుందని నమ్మకంతో ఉన్నాం’ అని నమ్మకం వెలిబుచ్చారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల కథానాయిక సోనాలీ ఆనందం వెలిబుచ్చింది. ఈ చిత్రానికి కెమెరా కర్ణ ప్యరసాని, సంగీతం: మహావీర్.