Chaari 111 Movie | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చారి 111’ (Chaari 111). తమిళ ముద్దుగుమ్మ సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్గా నటిస్తుండగా.. టీజీ కీర్తికుమార్ (TG keerthy Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 01న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మరోవైపు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైనట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. టెర్రరిజంకు చెందిన ఒక సీక్రెట్ గ్రూప్ ఇండియాలో కోవర్ట్ ఏజెన్సీని స్టార్ట్ చేయాలనీ చూస్తుంది. ఒకవేళ అది స్టార్ట్ అయితే దేశానికి ప్రమాదం. ఇక ఇది కనిపేట్టే సీక్రెట్ స్పైగా ఏజెంట్‌గా వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. ఇక సీనియర్ నటుడు మురళి శర్మ ఈ సినిమాలో స్పై ఏజెన్సీ హెడ్‌గా కనిపించనున్నారు. ట్రైలర్ మొత్తం ఫన్ ఎంటర్టైనర్గా సాగింది. ఈ సినిమాను బర్కత్ స్టూడియెస్ బ్యానర్‌పై అదితి సోని నిర్మిస్తుంది.
#Chaari111 – U/A – 01st March Release pic.twitter.com/ObrVxVvfAT
— Aakashavaani (@TheAakashavaani) February 27, 2024