Aishwarya Rai Bachchan | ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ చలనచిత్రోత్సవంలో బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు దశకు చేరుకున్న సమయంలో ఆమె ఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ ‘లోరియల్’ (L’Oreal) ప్రతినిధిగా హాజరైన ఐశ్వర్యరాయ్, ఈసారి ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ ప్రత్యేకంగా రూపొందించిన స్కల్ప్చరల్ గౌన్‌లో మెరిసిపోయి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఐశ్వర్యరాయ్ కోసం అమిత్ అగర్వాల్ ఈ ఏడాది ‘లుమినారా’ (Luminara) అనే ప్రత్యేకమైన డిజైన్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. దాదాపు 1500 గంటల పాటు చేత్తో శ్రమించి ఈ దుస్తులపై డిజైన్ చేసినట్లు సమాచారం. వేల సంఖ్యలో క్రిస్టల్స్, ఎంబ్రాయిడరీ వర్క్‌తో శరీరంపై కాంతి కిరణాలు ప్రవహిస్తున్నట్లు ఉండేలా దీనిని రూపొందించారు.
మరోవైపు ఫ్రెంచ్ రివేరా వేదికపై కెమెరాలకు ఫోజులిస్తూ ఐశ్వర్యరాయ్ అందరినీ ఆకట్టుకున్నారు. భుజాల నుండి రెక్కల తరహాలో విస్తరించిన డిజైన్, ముదురు నీలి రంగు (Abyss blue) ఈ గౌన్‌కు మరింత లుక్ తెచ్చిపెట్టాయి. ఈ లుక్ కోసం స్టైలిస్ట్ మోహిత్ రాయ్, డిజైనర్ అమిత్ అగర్వాల్ కలిసి పనిచేశారు. దశాబ్దాలుగా గ్లోబల్ స్టేజ్‌పై ఐశ్వర్యరాయ్ ప్రదర్శిస్తున్న అద్భుతమైన కాంతిని, ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ‘లుమినారా’ను డిజైన్ చేసినట్లు అమిత్ అగర్వాల్ తెలిపారు. ఈ అద్భుతమైన లుక్ చూసిన తర్వాత, ఫెస్టివల్ ముగింపు వేడుకలో ఐశ్వర్య ఎలాంటి డ్రెస్‌లో కనిపిస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#AishwaryaRaiBachchan brought all the drama to #Cannes 2026 in a striking blue look 💙✨
___
📹: @treyshotyou, @martinezhotel, @gettyimages pic.twitter.com/jBVfhnRacz— GQ India (@gqindia) May 22, 2026