Canada theatres | గుర్తుతెలియని గ్యాస్‌ను స్ప్రే చేసిన దుండగులు : థియేటర్లను ఖాళీ చేయించిన పోలీసులు
కెనడాలోని గ్రేటర్ టొరంటోలో వివిధ ప్రాంతాలకు చెందిన మూడు సినిమా థియేటర్లను (Canada theatres) పోలీసులు ఖాళీ చేయించారు.
టొరంటో : కెనడాలోని గ్రేటర్ టొరంటోలో వివిధ ప్రాంతాలకు చెందిన మూడు సినిమా థియేటర్లను (Canada theatres) పోలీసులు ఖాళీ చేయించారు. మాస్క్ ధరించిన దుండగులు హిందీ సినిమాలను ప్రదర్శిస్తున్న థియేటర్లలో గుర్తుతెలియని గ్యాస్‌ను స్ప్రే చేయడంతో ఆయా థియేటర్ల నుంచి ప్రేక్షకులను పంపించివేశారు. ఈ ఘటనలకు సంబంధించి ఎవరూ తీవ్ర అస్వస్ధతకు లోనవడం, ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
వాఘన్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ తరహా ఘటన జరిగిందని యార్క్ ప్రాంతీయ పోలీసులు వెల్లడించారు. మాస్క్ ధరించిన ఇద్దరు వ్యక్తులు గుర్తుతెలియని గ్యాస్‌ను స్ప్రే చేయడంతో పలువురు ప్రేక్షకులు దగ్గుతో బాధపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో హిందీ సినిమా ప్రదర్శితమవుతుండగా 200 మంది సినీ ప్రియులు మూవీని వీక్షిస్తున్నారని చెప్పారు.
ఘటన నేపధ్యంలో ప్రేక్షకులను పోలీసులు థియేటర్ల నుంచి బయటకు పంపించివేశారు. ఘటనపై సమాచారం అందుకుని పోలీసులు అక్కడకు చేరుకునేలోపే అనుమానితులు తప్పించుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అదే రోజు సాయంత్రం మూడు గంటల వ్యవధిలోనే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు చెప్పారు.
Read More :
Chennai: వరద నీటిలో చెన్నై.. కొనసాగుతున్న రిలీఫ్ ఆపరేషన్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

