బ్రహ్మాజీ ప్రధానపాత్రలో నటించిన విభిన్న కథాచిత్రం ‘హ్యాంగ్మెన్’. విహాన్ దర్శకుడు. వి.శ్రీకాంత్ మైసూర్, వీహెచ్ రావు నిర్మాత. ఈ నెల 3న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. పద్మశ్రీ డా.బ్రహ్మానందం, నందినీరెడ్డి, అద్దంకి దయాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
‘ఇలాంటి ఓ విభిన్నమైన కథకు కథానాయకుడిగా నన్ను అనుకున్న దర్శకుడు విహాన్‌కి రుణపడి ఉంటాను’ అని నటుడు బ్రహ్మాజీ అన్నారు. హార్డ్ హిట్టింగ్‌గా ఉండే సినిమా ఇదని, ఇది ఇప్పటివరకూ రాని కొత్త సబ్జెక్ట్ అని దర్శకుడు విహాన్ తెలిపారు. ఇంకా అజయ్ మైసూర్, ఉదయ్ గుర్రాల, రూపక్, రియల్ హ్యాంగ్మెన్ పవన్, సంగీత దర్శకుడు కమ్రాన్, ఎడిటర్ కార్తీక్, శశికిరణ్ కూడా మాట్లాడారు.