Bandar Trailer | క్రైమ్ థ్రిల్లర్‌గా బాబీ డియోల్ ‘బందర్’.. ట్రైలర్ విడుదల!
Bandar Trailer | బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బందర్ (BANDAR).
Bobby Deol | బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బందర్ (BANDAR). ‘యానిమల్’ సినిమాతో గ్లోబల్ స్థాయిలో తన పవర్ఫుల్ నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్, మరోసారి అంతకు మించిన ఇంటెన్స్ రోల్లో ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ట్రైలర్ చూస్తుంటే.. బాబీ డియోల్ ఈ సినిమాలో ఓ రాక్ స్టార్‌గా, విలాసవంతమైన జీవితాన్ని గడిపే ‘ప్లేబాయ్’ పాత్రలో కనిపిస్తున్నాడని తెలుస్తుంది. అయితే, అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో అతను అనుకోకుండా జైలు పాలు కావాల్సి వస్తుంది. అసలు బాబీ జైలుకు ఎందుకు వెళ్ళాడు? అతనిపై కేసు పెట్టిన ఆ యువతి ఎవరు? అనే ఆసక్తికర అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో బాబీ డియోల్‌తో పాటు సన్యా మల్హోత్రా, సబా ఆజాద్ మరియు సప్నా పబ్బి కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తుండగా.. నిఖిల్ ద్వివేది మరియు అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని హంగులతో, హై వోల్టేజ్ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రం 2026, జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. బాబీ డియోల్ కొత్త మేకోవర్ చూస్తుంటే ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

