Bobby Deol | బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బందర్ (BANDAR). ‘యానిమల్’ సినిమాతో గ్లోబల్ స్థాయిలో తన పవర్ఫుల్ నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్, మరోసారి అంతకు మించిన ఇంటెన్స్ రోల్లో ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
టీజర్ చూస్తుంటే బాబీ డియోల్ ఈ సినిమాలో ఓ రాక్ స్టార్‌గా, విలాసవంతమైన జీవితాన్ని గడిపే ‘ప్లేబాయ్’ పాత్రలో కనిపిస్తున్నాడని తెలుస్తుంది. అయితే, అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో అతను అనుకోకుండా జైలు పాలు కావాల్సి వస్తుంది. అసలు బాబీ జైలుకు ఎందుకు వెళ్ళాడు? అతనిపై కేసు పెట్టిన ఆ యువతి ఎవరు? అనే ఆసక్తికర అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో బాబీ డియోల్‌తో పాటు సన్యా మల్హోత్రా, సబా ఆజాద్ మరియు సప్నా పబ్బి కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తుండగా.. నిఖిల్ ద్వివేది మరియు అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని హంగులతో, హై వోల్టేజ్ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రం 2026, జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. బాబీ డియోల్ కొత్త మేకోవర్ చూస్తుంటే ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.