Bigg Boss 9 | రీతూ-సంజన వివాదంపై నాగార్జున సీరియస్ ..హౌస్ వదిలి వెళ్లిపోతానన్న సంజన
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 83వ రోజు భారీ డ్రామా నెలకొంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా సాగుతున్న షోలో వీకెండ్ ఎపిసోడ్ మొత్తం రీతూ–సంజన మధ్య నెలకొన్న ఘర్షణ చుట్టూనే సాగింది. గత కొన్ని రోజులుగా రీతూ, పవన్ రాత్రివేళల్లో కూర్చుని మాట్లాడుకోవడం తనకు ఇబ్బందిగా ఉందని సంజన చేసిన వ్యాఖ్యలు ఇంట్లో పెద్ద వివాదంగా మారాయి.
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 83వ రోజు భారీ డ్రామా నెలకొంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా సాగుతున్న షోలో వీకెండ్ ఎపిసోడ్ మొత్తం రీతూ–సంజన మధ్య నెలకొన్న ఘర్షణ చుట్టూనే సాగింది. గత కొన్ని రోజులుగా రీతూ, పవన్ రాత్రివేళల్లో కూర్చుని మాట్లాడుకోవడం తనకు ఇబ్బందిగా ఉందని సంజన చేసిన వ్యాఖ్యలు ఇంట్లో పెద్ద వివాదంగా మారాయి. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో కూడా ఇదే సమస్య కొనసాగడంతో ఇంటి వాతావరణం మరింత టెన్షన్‌గా మారింది. దీంతో నాగార్జున .. సంజన చేసిన ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో అనేక కెమెరాలు ఉన్నాయనీ, ఏది దాచిపెట్టలేదనీ, అయినా రీతూ–పవన్‌పై సంజన చేసిన వ్యాఖ్యలు క్యారెక్టర్ అసాసినేషన్‌కు దారితీసేలా ఉన్నాయని అన్నారు. సంజన మాత్రం నేను చూసిందే చెప్పానని, ఏం తప్పు చేయలేదని పేర్కొంది.
నీకు ఇబ్బందిగా ఉంటే హౌస్ గేట్స్ ఓపెన్ చేస్తాను, వెళ్లిపోవచ్చు” అని నాగార్జున కఠినంగా హెచ్చరించగా, సంజన నిజంగానే వెళ్లిపోతానని ప్రకటించింది. పరిస్థితి మరింత సీరియస్ అవడంతో నాగార్జున నిర్ణయాన్ని భరణి, ఇమ్మాన్యుయేల్, తనూజపై వదిలేశారు. ముగ్గురూ కలిసి సంజన.. రీతూ, బిగ్ బాస్, ప్రేక్షకులను క్షమాపణ కోరితే హౌస్‌లో ఉండవచ్చని తీర్పు చెప్పారు. సంజన మొదట క్షమాపణ చెప్పడానికి కూడా ఒప్పుకోలేదు. “మనసు చంపుకుని నేను ఇక్కడ ఉండలేను” అని చెప్పడంతో నాగార్జున కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. చివరకు నాగార్జున రిక్వెస్ట్ చేయడంతోనే సంజన సాఫ్ట్ అయింది.
చివరికి సంజన ప్రేక్షకులకు, రీతూకి క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసింది. కానీ అక్కడితో నాగార్జున క్లాస్ ఆపలేదు.తూ తరచూ పవన్ తరుపున మాట్లాడటం తప్పేనని, “నువ్వు అతడికి లాయర్‌వా?” అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.కెప్టెన్సీ టాస్క్ సమయంలో కుర్చీ విసిరిన కళ్యాణ్ మీద కూడా నాగార్జున తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ రీతూ–సంజన మధ్య మాటల యుద్ధం, సంజన వెళ్లిపోతాననే డ్రామా, చివరకు క్షమాపణతో ముగింపు .. ఇలా ఒకే ఒక్క ఎపిసోడ్ ప్రేక్షకులను మైండ్‌గేమ్‌లతో అలరించింది. బిగ్ బాస్ తెలుగు 9లో రాబోయే రోజులు ఇంకా ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

