Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్‌లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో నామినేషన్ల ప్రక్రియ రెండో రోజూ వాడీవేడిగా కొనసాగింది. ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధం, పరస్పర విమర్శలు, గ్రూపిజం ఆరోపణలతో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా షాలిని, రోహిత్‌ల వ్యవహారశైలి మరోసారి చర్చకు దారితీసింది. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లతోనూ షాలిని వాగ్వాదానికి దిగడంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో నామినేషన్ల ప్రక్రియ రెండో రోజూ వాడీవేడిగా కొనసాగింది. ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధం, పరస్పర విమర్శలు, గ్రూపిజం ఆరోపణలతో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా షాలిని, రోహిత్‌ల వ్యవహారశైలి మరోసారి చర్చకు దారితీసింది. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లతోనూ షాలిని వాగ్వాదానికి దిగడంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది. చివరకు ఈ వారం నామినేషన్లలో వంశీ, అమన్, వర్షిణి, రోహిత్, షాలిని, రామ్ ప్రసాద్ నిలిచారు. గత ఎపిసోడ్లో షాలిని దేబ్జానీని నామినేట్ చేయడంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తాజాగా కొనసాగిన ఎపిసోడ్లో షాలిని తన రెండో నామినేషన్‌గా వర్షిణి పేరును ప్రకటించింది. వర్షిణి తన వాదనను వినిపించే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఎప్పటిలాగే రోహిత్ కూడా షాలినికి మద్దతుగా రంగంలోకి దిగడంతో గొడవ మరింత పెరిగింది. మధ్యలో త్రిగుణ్ కూడా జోక్యం చేసుకున్నాడు.
ఇప్పటికే షాలిని, రోహిత్ ఒకే గ్రూపుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో నాగార్జున సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాజాగా షాలిని, కొత్తగా వచ్చిన శివకుమార్‌ను కూడా సెలబ్రిటీల గ్రూపులో భాగమని పేర్కొనడంతో అతడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరిని నామినేట్ చేసిన తర్వాత వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లలో ఒకరిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి రావడంతో నీతూ మాస్టర్ వర్షిణిని నామినేషన్లోకి పంపినట్లు ఎపిసోడ్లో చూపించారు. తర్వాత వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్ దక్షి.. దేబ్జానీ, నరేష్‌లను పిలిచింది. టాస్క్‌లో దేబ్జానీ విజయం సాధించడంతో ఆమెకు నామినేషన్ చేసే అవకాశం లభించింది. దేబ్జానీ మొదట షాలిని పేరును చెప్పింది. రోహిత్‌తో కలిసి గేమ్ ఆడుతున్నారనే అభిప్రాయంతో తన కారణాలను వివరించింది.
అయితే దేబ్జానీ మాట్లాడుతుండగానే షాలిని మధ్యలోనే స్పందిస్తూ గట్టిగా వాదించింది. దీంతో రోహిత్ కూడా చర్చలోకి రావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అనంతరం రామ్ ప్రసాద్ పేరును ప్రస్తావిస్తూ, ఇతరులను బాధపెట్టే విధంగా కామెడీ చేయకూడదనే కారణంతో దేబ్జానీ అతడిని కూడా నామినేట్ చేసింది. దక్షి షాలిని నామినేషన్‌ను ఆమోదించడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లతోనూ వాగ్వాదానికి దిగింది. నీతూ మాస్టర్ జోక్యం చేసుకున్న సమయంలోనూ షాలిని తన వాదనను గట్టిగా వినిపించింది.
మరో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్ రామకృష్ణ.. వంశీ, రామ్ ప్రసాద్‌లకు టాస్క్ ఇచ్చాడు. అందులో వంశీ గెలవడంతో నామినేషన్ చేసే అవకాశం దక్కింది. వంశీ మొదట షాలిని పేరును ప్రకటిస్తూ తన కారణాలను వివరించేందుకు ప్రయత్నించాడు. అయితే షాలిని తన వాదనను వినిపించే క్రమంలో గట్టిగా మాట్లాడటంతో బిగ్‌బాస్ జోక్యం చేసుకుని తదుపరి నామినేషన్‌కు వెళ్లాలని సూచించాడు. అనంతరం వంశీ ముకేశ్ పేరును నామినేట్ చేశాడు. రామకృష్ణ షాలిని నామినేషన్‌ను ఆమోదించడంతో ఆమె అతడితోనూ వాగ్వాదానికి దిగింది. నామినేషన్ టాస్క్‌లో ఓడిపోయినవారికి కూడా మరో అవకాశం ఇస్తున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఈసారి టాస్క్‌లో ఓడినవారు కూడా నామినేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేశాడు.
త్రిగుణ్, వర్షిణి మధ్య జరిగిన టాస్క్‌లో త్రిగుణ్ గెలిచాడు. అనంతరం రోహిత్‌ను నామినేట్ చేస్తూ అతడి వ్యవహారశైలి, గ్రూపిజం గురించి విమర్శలు చేశాడు. మరోవైపు అమన్, రామ్ ప్రసాద్‌ల మధ్య జరిగిన టాస్క్‌లో అమన్ విజయం సాధించాడు. అతడు వర్షిణిని నామినేట్ చేశాడు. గతంలో ఓ టాస్క్‌లో వర్షిణి అమన్‌ను హగ్ చేసుకున్న అంశాన్ని అమన్ మళ్లీ ప్రస్తావించాడు. ఆ ఘటనపై నాగార్జున గతంలో మందలించిన విషయాన్ని కూడా గుర్తు చేయడంతో వర్షిణి భావోద్వేగానికి గురై ఏడ్చింది. ఈ అంశం హౌస్‌లో మరోసారి చర్చకు దారితీసింది. తర్వాత నరేష్, ఝాన్సీ మధ్య జరిగిన టాస్క్‌లో నరేష్ గెలిచాడు. అతడు రోహిత్‌ను నామినేట్ చేస్తూ గతంలో చరణ్ గురించి రోహిత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాడు.
చరణ్ ఎలిమినేషన్‌కు సంబంధించిన ఓటింగ్ సమయంలో చాలామంది షాలినికి ఓటు వేయగా, అమన్ మాత్రమే చరణ్‌కు ఓటు వేసిన విషయాన్ని గుర్తు చేశాడు. గత నామినేషన్లలో చరణ్ తనకంటే మెరుగ్గా ఆడుతున్నాడని రోహిత్ చెప్పిన విషయాన్ని కూడా నరేష్ ప్రస్తావించాడు. చరణ్ అంత బాగా ఆడితే, అతడికి ఎందుకు ఓటు వేయలేదని ప్రశ్నించడంతో చర్చ మరింత వేడెక్కింది. ఈ విషయంపై రోహిత్ తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. చరణ్‌కు తిరిగి హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉండొచ్చనే ఉద్దేశంతో షాలినికి ఓటు వేసినట్లు చెప్పాడు. ఈ వివరణపై ఇంటి సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అనంతరం చరణ్ గురించి సానుకూలంగా మాట్లాడినందుకు షాలిని రోహిత్‌తో కూడా గొడవ పడినట్లు ఎపిసోడ్లో చూపించారు.
నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి బిగ్‌బాస్ తెలుగు 10లో ఈ ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్లో నిలిచారు.వంశీ,అమన్,వర్షిణి,రోహిత్,షాలిని,రామ్ ప్రసాద్.. ఈ ఆరుగురిలో ఒకరు ఈ వారం హౌజ్ నుండి బయటకు వెళ్లనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్‌లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
Mamata Banerjee | మమతపై హత్యాయత్నం?.. చీరలో కత్తితో ఇంటటికొచ్చిన యువతి!
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

