Bigg Boss 10 | రివెంజ్ తీర్చుకున్న త్రిగుణ్.. అమన్‌కు షాక్, ఫ్యామిలీని కలిసే ఛాన్స్ మిస్!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆట రసవత్తరంగా సాగుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ హౌస్మేట్స్ మధ్య పోటీ, గొడవలు, భావోద్వేగాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా 60వ రోజు హౌస్‌లో రివెంజ్ అండ్ రివార్డ్ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన బాస్కెట్ టాస్క్‌లో హౌస్మేట్స్ హోరాహోరీగా పోటీపడ్డారు. అయితే ఈ టాస్క్‌లో త్రిగుణ్ తన ప్రత్యర్థి అమన్‌పై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు వచ్చే వారం కుటుంబ సభ్యులను కలిసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆట రసవత్తరంగా సాగుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ హౌస్మేట్స్ మధ్య పోటీ, గొడవలు, భావోద్వేగాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా 60వ రోజు హౌస్‌లో రివెంజ్ అండ్ రివార్డ్ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన బాస్కెట్ టాస్క్‌లో హౌస్మేట్స్ హోరాహోరీగా పోటీపడ్డారు. అయితే ఈ టాస్క్‌లో త్రిగుణ్ తన ప్రత్యర్థి అమన్‌పై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు వచ్చే వారం కుటుంబ సభ్యులను కలిసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. రివెంజ్ అండ్ రివార్డ్ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన బాస్కెట్ టాస్క్‌లో దేబ్జానీ, నరేష్, త్రిగుణ్, రామ్ ప్రసాద్, శివకుమార్ పోటీపడ్డారు. ఈ టాస్క్‌లో దేబ్జానీ గట్టిగా పోరాడగా, చివరికి త్రిగుణ్, శివకుమార్ పైచేయి సాధించారు. దీంతో వీరిద్దరి మధ్య టై బ్రేకర్ పోటీ నిర్వహించారు. ఈ కీలక పోరులో త్రిగుణ్ విజయం సాధించాడు.
దీంతో వచ్చే వారం తన కుటుంబ సభ్యులను కలుసుకునే ప్రత్యేక అవకాశాన్ని త్రిగుణ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఈ టాస్క్‌లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన ఫొటోను చించేశాడంటూ గతంలో అమన్ చేసిన ఆరోపణలకు త్రిగుణ్ ఈసారి గట్టి సమాధానం ఇచ్చాడు. అమన్ కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని కోల్పోయేలా చేశాడు. ఈ సందర్భంగా త్రిగుణ్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘మీ ఇంట్లో ఒక ముద్ద తిన్నాను. అలాంటప్పుడు నేను నీ ఫొటో చించుతానని ఎలా అనుకుంటావ్?’’ అంటూ అమన్‌ను ఉద్దేశించి ప్రశ్నించాడు. తనపై వచ్చిన ఆరోపణలు తనను ఎంతగానో బాధించాయని అతడి మాటల్లో కనిపించింది. దీంతో ఈ టాస్క్ కేవలం గెలుపోటములకే పరిమితం కాకుండా ఇద్దరి మధ్య ఉన్న పాత గొడవకు మరోసారి వేదికగా మారింది.
మరోవైపు నరేష్, దేబ్జానీ, నీతూ మధ్య కూడా బాస్కెట్ టాస్క్ ఆసక్తికరంగా సాగింది. ప్రారంభంలో నరేష్ మంచి ఆధిక్యం కనబరిచాడు. అయితే రంగులను సరైన క్రమంలో అమర్చే సమయంలో గందరగోళానికి గురయ్యాడు. ఇదే సమయంలో నీతూ ఫిజికల్ గేమ్ ఆడుతూ నరేష్ ఆటను అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో నరేష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కోపంతో నీతూ ఆటను పూర్తిగా చెడగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి ఆట కూడా దెబ్బతింది. ఇద్దరూ ఒకరినొకరు అడ్డుకోవడంతో చివరకు దేబ్జానీకి కలిసొచ్చింది. ఈ పోటీలో ఆమె విజయం సాధించింది. మొత్తానికి రివెంజ్ అండ్ రివార్డ్ టాస్క్ హౌస్‌లో కొత్త వివాదాలకు తెరతీసింది. ఒకవైపు త్రిగుణ్ తన కుటుంబాన్ని కలిసే అవకాశాన్ని దక్కించుకోగా, మరోవైపు అమన్ ఆ అవకాశాన్ని కోల్పోయాడు. ఇక దేబ్జానీ కూడా తన ఆటతీరుతో విజయం సాధించింది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు హౌస్‌లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aman
- bigg boss 10
- naresh
- Trigun
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | రివెంజ్ తీర్చుకున్న త్రిగుణ్.. అమన్‌కు షాక్, ఫ్యామిలీని కలిసే ఛాన్స్ మిస్!
Common Pass | కామన్ పాస్ రేట్..యూటర్న్ ధరలు తగ్గించేందుకు కమిటీ నివేదిక
Sai Dharam Tej | ఘనంగా సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం..
Bloody Romeo | గ్యాప్ తీసుకోని నాని..! జెట్ స్పీడ్‌లో బ్లడీ రోమియో
Agniveer Scheme | అగ్నివీరుల పెండ్లి నిబంధనల్లో మార్పు? మినహాయింపు ఇచ్చే అవకాశం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

