ఒకరోజు ముందుగానే OTTలోకి భీమ్లా నాయక్.. కారణం ఇదేనా..?
Bheemla Nayak in OTT | పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. మార్చి 25న ఈ సినిమాను ఆహాతో పాటు డిస్నీ హాట్స్టార్లో విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పుడు అనుకున్న తేదీ కంటే ఒక్క రోజు ముందుగానే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆహాతో పాటు హాట్ స్టార్ లోనూ మార్చి 24 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
మార్చి 25న ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల కానుంది. ఆ రోజు భీమ్లా నాయక్ విడుదల చేసినా కూడా వ్యూస్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు అంతా రాజమౌళి మేనియా నడవడం ఖాయం. అలాంటి సమయంలో భీమ్లా నాయక్ విడుదల చేసినా కూడా పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు. పవన్ సినిమా చూడాలని అభిమానులు ఆసక్తిగానే ఉన్నారు. అయితే ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా వస్తున్న రోజు విడుదల చేస్తే.. వ్యూస్ తక్కువగా వస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సాధారణంగా అఖండ, పుష్ప లాంటి సినిమాలు ఓటీటీలో విడుదలైన మొదటి రోజు రికార్డు వ్యూస్ అందుకున్నాయి.
భీమ్లా నాయక్ విషయంలో కూడా ఇదే జరగాలంటే.. ఆ రోజు వస్తున్నపుడు మరే సినిమా కూడా రాకూడదు. అందుకే మార్చి 23 అర్ధరాత్రే ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్లో ఈ సినిమాను తీసుకొస్తున్నారు. దాంతో కచ్చితంగా వ్యూస్ కూడా అంతే స్థాయిలో వస్తాయని నమ్ముతున్నారు మేకర్స్. విడుదలయ్యాక కేవలం నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో వచ్చేస్తుండటంతో అభిమానులు కూడా ఆసక్తిగానే చూస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

