Bheemlanayak | భారీగా జరిగిన భీమ్లానాయక్.. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ బిజినెస్
Bheemla nayak movie business | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు.
Bheemla nayak movie business | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లానాయక్’. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘అయ్యపనుమ్ కోషియుమ్’ సినిమాకు రీమేక్‌గా తెరికెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రి రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగిందట. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 100 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. హిందీలో ఈ చిత్ర డబ్బింగ్ రైట్స్ దాదాపు 23 కోట్లకు పెన్ స్టూడియోస్ సొంతం చేసుకుందని టాక్. ఈ చిత్రానికి శాటిలైట్, డిజిటల్ హక్కులు 40కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. డిస్నీహాట్‌స్టార్, ఆహా రెండు సంస్థలు ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను కొనుగోలు చేశాయట. ఇక ఆడియో రైట్స్ రూపంలో 5 కోట్ల వరకు నిర్మాతలకు ముట్టిందని సమాచారం. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేయున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

