Bheemla Nayak | హిందీలో విడుదలకు సిద్ధమైన ‘భీమ్లానాయక్’.. విడుదల ఎప్పుడంటే?
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం భీమ్లానాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు.
Bheemla Nayak Hindi release | పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘భీమ్లానాయక్’. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు స్క్రీన్‌ప్లే అందించాడు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం 150కోట్ల గ్రాస్ కలెక్షన్లను 88 కోట్ల షేర్‌ను సాధించింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం హిందీ విడుదలకు సిద్ధమైంది.
మొదట తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల హిందీలో విడుదల కాలేదు. ఇప్పుడు భీమ్లానాయక్ చిత్రం ఈ శుక్రవారం హిందీ వెర్షన్లో విడుదల కానుంది. ఇందులో పవన్ పోలీస్ అధికారిగా కనిపించగా రానా ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా నిత్యామీనన్ నటించగా, రానాకు జోడిగా సంయుక్త మీనన్ నటించింది. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

