Bharathanatyam Movie | ‘దొరసాని’ (Dorasani) లాంటి ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టాడు దర్శకుడు కేవీఆర్ మహేంద్ర (KVR Mahendra). తెలంగాణ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిసెంట్ హిట్ తెచ్చుకోవడమే కాకుండా విమర్శకుల దగ్గరనుంచి ప్రశంసలు అందుకుంది. ఇక తాజాగా కేవీఆర్ మహేంద్ర డైరెక్షన్లో వస్తున్న చిత్రం భరతనాట్యం (Bharathanatyam). సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంతో సీనియర్ గ్రాఫిక్ డిజైనర్ ధని ఏలే (Dhani Aelay) తనయుడు సూర్య తేజ ఏలే (Surya Teja Aelay) టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మీనాక్షి గోస్వామి (Meenakshi Goswamy) కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ ట్రైలర్ చూస్తే.. సినిమా పరిశ్రమలో దర్శకుడు అవ్వాలనుకొనే ఓ యువకుడు.. ఎదుర్కొన్న పరిస్థితులు ఎంటీ.. చివరికి అన్ని అధిగమించి దర్శకుడు అవ్వగలిగాడా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో హర్షవర్ణన్, వైవా హర్ష, అజయ్ ఘోష్, గంగవ్వ, సలీం ఫేకు, టెంపర్ వంశీ తదితరుల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.