Bhama Kalapam 2 | ప్రియమణి ‘భామాకలాపం 2’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.!
Bhama Kalapam 2 | 2022లో ప్రియమణి ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘భామాకలాపం’. అభిమన్యు తాడిమేటి దర్శకుడు. సుధీర్ ఈదర, బాపినీడు నిర్మించారు. ప్రముఖ తెలుగు ఓటీటీ దిగ్గజం ‘ఆహా’లో నేరుగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఓటీటీలో విడుదలైన అనంతరం కొన్ని రోజుల పాటు ట్రెండింగ్‌లో నిలిచింది.
Bhama Kalapam | 2022లో ప్రియమణి ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘భామాకలాపం’. అభిమన్యు తాడిమేటి దర్శకుడు. సుధీర్ ఈదర, బాపినీడు నిర్మించారు. ప్రముఖ తెలుగు ఓటీటీ దిగ్గజం ‘ఆహా’లో నేరుగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. యూట్యూబ్‌లో కొత్త వంటకాలను చేసే ఒక గృహిణి అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కుంటుంది. అయితే ఈ మర్డర్ వలన ఆమె కుటుంబం ఎలా ఇబ్బందుల్లో పడింది అనేది ఈ మూవీ స్టోరీ. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం కొన్ని రోజుల పాటు ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక ఈ సినిమాలో ప్రియమణి నటనైతే వేరే లెవల్. అప్పటివరకు హీరోయిన్గా మెప్పించిన ప్రియమణి.. భామాకలాపంతో తనలోని విలక్షణ నటనను చూపించింది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది.
తాజాగా ఈ సినిమాకు భామా కలాపం 2 అంటూ సీక్వెల్ రాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించి చిత్రంబృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ప్రియమణి అమ్మవారి రూపంలో చేతిలో వ్యాక్యూమ్ క్లీనర్నే ఆయుధంగా పట్టుకుని ఉగ్రరూపంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక పార్ట్ 1 కు దర్శకత్వం వహించిన అభిమన్యు ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే పార్ట్ 2 ఈసారి ఓటీటీలోకి కాకుండా నేరుగా థియేటర్లలో విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను ఆహా స్టూడియో, డ్రిమ్ ఫార్మర్స్ బ్యానర్‌పై సుధీర్ ఈదర, భోగవల్లి బాపినీడు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
𝐓𝐇𝐄 𝐌𝐎𝐒𝐓 𝐃𝐀𝐍𝐆𝐄𝐑𝐎𝐔𝐒 𝐖𝐎𝐌𝐀𝐍,
Anupama aka #Priyamani is back with #Bhamakalapam2 💥🔪This time,
To serve ‘A Delicious Heist Feast!’
IN THE THEATRES 📽️😈#AbhimanyuTadimeti @prashanthvihari#DeepakYaragera#Bapineedu @sudheer_ed @WeDreamFarmers@ahavideoIN pic.twitter.com/ux6kbKo937— Vamsi Kaka (@vamsikaka) November 23, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

