Bhagavanth Kesari Movie | దసరి బరిపై మొదట గురిపెట్టింది భగవంత్ కేసరి సినిమానే. బాలయ్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అనీల్ రావిపూడి దర్శకుడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ మాస్ ఆడియెన్స్‌లో భీభత్సమైన అంచనాలు నెలకొల్పాయి. ఇప్పటివరకు మాస్ జానర్‌ను టచ్ చేయని అనిల్ రావిపూడి ఏకంగా మాస్కు నిర్వచనంగా చెప్పుకునే బాలయ్యతో సినిమా చేస్తున్నాడంటే నందమూరి అభిమానులతో సహా సగటు ప్రేక్షకుడిలోనూ అమితాసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో తెగ బిజీగా ఉంది. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 8న రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వరంగల్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా జరుపబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల కనిపించనుందని టాక్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు పోటీగా రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో పాటు తమిళ సినిమా లియో, కన్నడ సినిమా ఘోస్ట్‌లు రిలీజ్ అవుతున్నాయి.