Karthikeya | కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. ఆగస్టు 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం ఈ చిత్రంలోని ‘సొల్లుడా శివ’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘భోగమంత యిడువవు వింతగుంది రా..
నువెవడివి సొల్లుడా శివా.. నువెవడివి సొల్లుడా శివ’ అంటూ సాగే ఈ గీతానికి మణిశర్మ సంగీతం అందించారు. కృష్ణ చైతన్య సాహిత్యం సమకూర్చిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, పృథ్వీ చంద్ర ఆలపించారు. నిర్మాత మాట్లాడుతూ ‘అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా వుండే సినిమా ఇది’ అన్నారు.