రామ్‌చరణ్ కథ గురించి అడిగారు
‘కథ వినేటప్పుడు నేను సాధారణ ప్రేక్షకుడిగా ఆలోచిస్తాను. ప్రేక్షకుడిగా సినిమా చూసినప్పుడు కొత్తదనం వుండాలని కోరుకుంటా. కథ కుదిరిన తరువాత మిగతా అంశాలు అన్నీ కుదురుతాయి’ అన్నారు నిర్మాత బెన్నీ ముప్పానేని.
‘కథ వినేటప్పుడు నేను సాధారణ ప్రేక్షకుడిగా ఆలోచిస్తాను. ప్రేక్షకుడిగా సినిమా చూసినప్పుడు కొత్తదనం వుండాలని కోరుకుంటా. కథ కుదిరిన తరువాత మిగతా అంశాలు అన్నీ కుదురుతాయి’ అన్నారు నిర్మాత బెన్నీ ముప్పానేని. జాతీయ పురస్కారం అందుకున్న ‘కలర్ ఫోటో’ చిత్రాన్ని నిర్మించిన ఆయన తన సంస్థలో మూడో చిత్రంగా నిర్మించిన చిత్రం ‘బెదురులంక 2012’. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకుడు. ఈ శుక్రవారం సినిమా విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా బెన్నీ మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ‘కథలో ఫియర్ కూడా ఓ పాత్ర పోషిస్తుంది. అందుకే ‘బెదురులంక 2012’ అని పెట్టాం. ఓ ఊహాజనిత గ్రామంలో 2012లో 21 రోజులు ఏం జరిగింది? అనేది కథ. మేం చెప్పాలనుకున్న కథకు 2012 నేపథ్యం అవసరం. ప్రేక్షకులు మన సినిమా ఎందుకు చూడాలి? మనం వాళ్లకు అందిస్తున్న కొత్తదనం ఏమిటి? అనేది నేను చెక్‌లిస్ట్‌గా పెట్టుకుంటాను. క్లాక్స్ కథ చెప్పినప్పుడు కథలోని కొత్తదనం నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించాను. తనకు నచ్చినట్లు జీవించే పాత్రలో కార్తికేయ కనిపిస్తారు. మా సినిమా కథ గురించి హీరో రామ్‌చరణ్ అడిగి తెలుసుకున్నారు. మణిశర్మ సంగీతం, కార్తికేయ, నేహాశెట్టి జోడి బాగుందన్నారు. ఈ సినిమా తరువాత నిర్మించబోయే మూడు సినిమాల కథలు రెడీగా వున్నాయి. వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

