‘ధమాకా’తో సూపర్ హిట్ అందుకుంది అందాల తార శ్రీలీల. ప్రస్తుతం ఆమెకున్న క్రేజీ మూవీస్ చూస్తుంటే ఇండస్ట్రీలో ఈ భామ జోరు మొదలైందని అనుకోవచ్చు. శ్రీలీల ఖాతాలో ఉన్న చిత్రాల్లో మహేష్ బాబు సరసన నటిస్తున్న మూవీ ఆమెకు మరింత ఆనందాన్నిస్తున్నది. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల సెకండ్ లీడ్‌గా చేస్తుందని ఇప్పటిదాకా అనుకున్నారు. అయితే మహేష్ సరసన పూజాతో పాటు శ్రీలీల కూడా హీరోయిన్‌గానే నటిస్తుందని ఇటీవల చిత్ర నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
కథలో ఒకరు ఫస్ట్, మరొకరు సెకండ్ అనేది లేదని..ఇద్దరూ హీరోయిన్స్‌గానే ఉంటారని ఆయన వెల్లడించారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 11న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీలకు ఈ చిత్రంతో పాటు కన్నడ తెలుగు సినిమా ‘జూనియర్’, నవీన్ పోలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’, రామ్ సరసన ఓ చిత్రం ఉన్నాయి. ఈ చిత్రాలతో పాటు తెలుగులో మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని తెలిసింది.