పోటీ నుంచి తప్పుకొన్న బండ్ల గణేష్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇరు వర్గాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలుగు చిత్రసీమలో వాతావరణం వేడెక్కింది. ఈ నెల 10న జరుగనున్న ‘మా’ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవికి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన బండ్ల గణేష్ పోటీనుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు శుక్రవారం ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.‘నా దైవ సమానులు.. ఆత్మీయులు.. శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను ‘మా’ జనరల్ సెక్రటరీ నామినేషన్ ఉపసంహరించుకుంటున్నాను’ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్‌లతో తాను కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌చేశారు. ‘మా’ ఎన్నికల్లో తొలుత ప్రకాష్‌రాజ్‌కు మద్దతు ప్రకటించిన బండ్ల గణేష్ అనూహ్యంగా ఆయన ప్యానల్ నుంచి వైదొలిగి ఇండిపెండెంట్‌గా పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. తనదైన శైలిలో వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్న ఆయన అర్ధాంతరంగా ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

