Film Chamber | రేపటినుంచి తెలంగాణలో థియేటర్స్ బంద్.. ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన
Film Chamber | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు మూతపడనున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా టాలీవుడ్లో పెద్ద సినిమాలేవి విడుదల లేకపోవడం, ఓ పక్క ఎన్నికలు, మరో పక్క ఐపీఎల్ ఉండటంతో భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు.
Film Chamber | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు మూతపడనున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా టాలీవుడ్లో పెద్ద సినిమాలేవి విడుదల లేకపోవడం, ఓ పక్క ఎన్నికలు, మరో పక్క ఐపీఎల్ ఉండటంతో భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లపై పడింది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకులు రాకపోవడంతో థియేటర్స్ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. అయితే ఈ నష్టాలను పూడ్చడానికి తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఓ నిర్ణయానికి వచ్చాయి. సమ్మర్ అయిపోయే వరకు ఓ రెండు వారాల పాటు థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. థియేటర్స్ కి జనాలు ఎవ్వరూ రావట్లేదని కారణంతోనే థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ శుక్రవారం నుంచి ఇది అమలులోకి రానున్నట్లు ప్రకటించారు.
అయితే ఈ ప్రకటనపై తాజాగా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలన్నది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయం అని, ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎగ్జిబిటర్స్ తమను సంప్రదించలేదని ఫిలిం చాంబర్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఎగ్జిబిటర్స్ వ్యక్తిగతంగా తీసుకున్నారని దీనితో ఫిలిం చాంబర్ కు ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు థియేటర్స్ క్లోజ్ చేయడం వలన చిన్న సినిమాలు నష్ట పోనున్నాయి. ఈ వారం గెటప్ శ్రీను రాజు యాదవ్‌తో పాటు లవ్ మీ మరిన్ని చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. అయితే ఈ సినిమాలకు థియేటర్స్ క్లోజ్ చేయడం వలన భారీ ఎఫెక్ట్ పడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

