Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Chiranjeevi | టాలీవుడ్లో నందమూరి, మెగా కుటుంబాలకు సంబంధించిన వార్తలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని సినీ రంగ ప్రవేశంపై మరోసారి చర్చ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ‘కాకా’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తేజస్వినిని సంప్రదించారనే ప్రచారం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Chiranjeevi | టాలీవుడ్లో నందమూరి, మెగా కుటుంబాలకు సంబంధించిన వార్తలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని సినీ రంగ ప్రవేశంపై మరోసారి చర్చ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ‘కాకా’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తేజస్వినిని సంప్రదించారనే ప్రచారం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వార్తలపై ఆమె భర్త, విశాఖపట్నం ఎంపీ భరత్ స్పందించడంతో ఆసక్తి మరింత పెరిగింది. నందమూరి తేజస్విని త్వరలోనే సినిమాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆమె ఓ ప్రకటనలో కనిపించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఈ క్రమంలో చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమాలో ఓ పాత్ర కోసం దర్శకుడు బాబీ ఆమెను సంప్రదించారనే వార్త తెరపైకి వచ్చింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎంపీ భరత్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. చిరంజీవి సినిమాలో ఓ పాత్ర కోసం బాబీ.. తేజస్వినిని సంప్రదించారన్న ప్రచారంలో నిజమెంత అని అడగ్గా ఆయన ఆసక్తికరంగా స్పందించారు. దర్శకుడు బాబీ తనకు బాగా తెలుసని చెప్పిన భరత్.. అయితే సినిమాలో తేజస్విని నటించాలనుకున్న కీలక పాత్ర ఏదీ లేదని పేర్కొన్నారు. సినిమాలో ఏదైనా పాత్ర కోసం తేజస్వినిని అడిగారా అని మరోసారి ప్రశ్నించగా, ఆ విషయం ఆమెకు, దర్శకుడు బాబీకి మధ్య ఉంటుందని భరత్ సమాధానమిచ్చారు. ఈ విషయంలో తాను ప్రత్యేకంగా అడిగి తెలుసుకోవాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తేజస్వినికి నటించాలని ఆసక్తి ఉంటే తాను తప్పకుండా మద్దతు ఇస్తానని తెలిపారు.
భరత్ వ్యాఖ్యలతో తేజస్విని సినీ రంగ ప్రవేశంపై మరోసారి చర్చ మొదలైంది. అయితే ఆమె ‘కాకా’ సినిమాలో నటించనున్నారా? లేదా? అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, చిరంజీవి కథానాయకుడిగా బాబీ తెరకెక్కిస్తున్న ‘కాకా’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి కుమార్తె పాత్రలో యువ నటి అనస్వర రాజన్ కనిపించనున్నట్లు సమాచారం. ఆమె పోషిస్తున్న ‘అమ్ములు పాప’ పాత్ర ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో చిరంజీవి కదిరి కాళిదాస్ అనే పాత్రలో కనిపించనున్నారు.చిరంజీవి సరసన స్నేహ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాచితా రామ్, నివేదా పేతురాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్, గెటప్ శ్రీను తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. తమన్ సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, లోకేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bobby
- Chiranjeevi
- Daughter
- Kaaka
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

