కారాగారంలో కామెడీ..
రీసెంట్గా విడుదల చేసిన బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ గణేశ్ ఆంథమ్ ఈ వినాయచవితికి చేసిన హంగామా అంతా ఇంతాకాదు. ఈ పాటకు అద్భుతమైన స్పందన లభించింది.
రీసెంట్గా విడుదల చేసిన బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ గణేశ్ ఆంథమ్ ఈ వినాయచవితికి చేసిన హంగామా అంతా ఇంతాకాదు. ఈ పాటకు అద్భుతమైన స్పందన లభించింది. ‘భగవంత్ కేసరి’ కోసం బాలకృష్ణ అభిమానులే కాదు. సగటు ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలావుంటే, ఈ సినిమా కథ విషయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఇందులో హీరో కథరీత్యా జైల్లో ఉండాల్సి వస్తుందట.
ఆ జైల్ ఎపిసోడ్ అంతా తనదైన శైలిలో పగలబడి నవ్వించాడట దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ ఎపిసోడ్లో అందరూ కామెడీ చేస్తారంట. కానీ బాలయ్య మాత్రం సీరియస్గా ఉంటారంట. ఆయన సీరియస్నెస్ నుంచే కామెడీ జనరేట్ అవుతూ ఉంటుందని తెలిసింది. ఓ విధంగా అనిల్ రావిపూడి కొత్త ప్రయోగమే చేశాడని చెప్పకతప్పదు. ఇది బాబాయి, కూతుర్ల కథ అని తెలుస్తున్నది. బాబాయిగా బాలయ్య, కూతురుగా శ్రీలీల చాలా గొప్పగా నటించారని యూనిట్ వర్గాల సమాచారం. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

