Balakrishna-gopichandhmalineni movie | అఖండ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఈయన వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఈయన ప్రస్తుతం గోపించంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈరోజు సిరిసిల్లలో లాంఛనంగా ప్రారంభమైంది. వేటపాలం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పెద్దాయన అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడిగా శృతి హాసన్ హీరోయిన్గా నటించనుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రం నాన్ స్టాప్‌గా నెల రోజులు షూటింగ్ జరపుకొనుందట. ఆరు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.