Kaala Bhairava | ‘బలగం’ బ్యూటీతో కాలభైరవ ప్రేమాయణం? టాలీవుడ్లో హాట్ టాపిక్.!
Kavya Kalyanram | ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి పెద్ద కుమారుడు, సింగర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ (Kaala Bhairava) త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తుంది.
Kavya Kalyanram | ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి పెద్ద కుమారుడు, సింగర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ (Kaala Bhairava) త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తుంది. ఆయన ‘బలగం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) తో ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు నెట్టింటా హల్ చల్ చేస్తున్నాయి. కాలభైరవ తమ్ముడు శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’ (Ustaad) సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కాలభైరవ మరియు కావ్యల మధ్య పరిచయం ఏర్పడిందని, అది క్రమంగా ప్రేమగా మారిందని సమాచారం. గత కొంతకాలంగా వీరిద్దరూ రహస్యంగా డేటింగ్లో ఉన్నట్లు, ఇప్పుడు ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల పెద్దలకు కూడా తెలుసని, వారు ఈ వివాహానికి అంగీకారం తెలిపారని సమాచారం. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా వివాహం ఇప్పటికే జరగడంతో, ఇప్పుడు పెద్ద కుమారుడు కాలభైరవ పెళ్లి పనులపై దృష్టి సారించినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు రీసెంట్గా వీరిద్దరూ కలిసి ఒక పుస్తకావిష్కరణ ఈవెంట్‌కి హాజరుకావడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రేమ, పెళ్లి వార్తలపై కాలభైరవ కానీ, కావ్య కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కావ్య కళ్యాణ్ రామ్ చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘గంగోత్రి’, ‘ఠాగూర్’, ‘బన్నీ’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్గా ‘మసూద’, ‘బలగం’ వంటి హిట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
Music Director #KalaBhairava and Actress #KavyaKalyanram at a book launch event.
pic.twitter.com/EPZv9SKlFF— DailySpark (@PantMania) March 24, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

