చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో..వాన జాన ఆడింది వయ్యారంగా..మీద పూలు జల్లింది సింగారంగా. ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ సూపర్ హట్ సాంగ్ గుర్తుంది కదా. సౌందర్యతో కలిసి బాబుమోహన్ (Babu mohan) వేసిన స్టెప్పులను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. కామెడీ, అదిరిపోయే డ్యాన్స్ తో అదరగొట్టిన బాబుమోహన్ చాలా రోజుల తర్వాత మళ్లీ తనలోని డ్యాన్సింగ్ స్కిల్‌ను అందరి ముందు పెట్టాడు. ఇంతకీ స్పెషల్ ఏంటీ అనుకుంటున్నారు.
ఈటీవీలో ప్రసారమయే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, శివ పార్వతి (Shiva Parvathy) అండ్ టీంతో కలిసి షోకు వచ్చారు బాబుమోహన్. కామెడీ స్కిట్స్ మధ్యలో పుష్పరాజ్‌లా మారిపోయారు బాబుమోహన్. కొన్నాళ్లుగా ఇండియావైడ్‌గా మూవీ లవర్స్ ను ఓ ఊపు ఊపేస్తున్న పాట పుష్పలోని చూపే బంగారమాయెనే శ్రీవల్లి (Srivalli Song). ఈ టాప్ ట్రెండింగ్ పాటకు బాబుమోహన్ స్టెప్పులేసి ఔరా అనిపించారు.
గళ్ల చొక్కా, లుంగీలో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని శివ పార్వతితో కలిసి శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి ఎంటర్ టైన్ చేశారు. ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలోనే బాబుమోహన్ ఇలా కనిపించాడంటే..ఇక ఫుల్ ఎపిసోడ్లో ఎలా అలరిస్తాడో చూడాలి.
RRR Promotions | ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు జక్కన్న కొత్త ప్లాన్..!