పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న భారీ చిత్రాల్లో ఒకటి ఆది పురుష్ (Adipurush). బాలీవుడ్ నటి కృతిసనన్ (Kriti Sanon) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కొన్ని నెలల క్రితం ఆది పురుష్ షూటింగ్ పూర్తయింది. మైథలాజికల్ మూవీగా వస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో పలు విషయాలు అందరితో పంచుకున్నాడు డైరెక్టర్ ఓం రావత్ (Om Raut). సినిమాలో ప్రభాస్ పేరు రామ కాదని లార్డ్ రామ మరో పేరు రాఘవ అని చెప్పాడు.
మొదట సినిమాలోని మూడు సన్నివేశాలు వివరించిన తర్వాత ప్రభాస్ తనను కలిసి ప్రాజెక్టును ఒకే చేశాడని తెలిపాడు ఓం రావత్. ఆదిపురుష్ సినిమాకు రూ.400 కోట్లు భారీ బడ్జెట్ పెట్టినట్టు బీటౌన్ సర్కిల్ టాక్. సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో నటిస్తున్నాడు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. సాచెట్-పరంపర ద్వయం ఈ ఎపిక్ డ్రామాకు మ్యూజిక్ అందించనున్నారు.
ఆదిపురుష్ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరాఠి నటుడు దేవ్దత్త నగే ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో నటిస్తుండగా..బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించనున్నాడు.