Ba Ba Black Sheep | బా బా బ్లాక్ షీప్ రివ్యూ.. మేఘాలయా బ్యాక్‌డ్రాప్‌లో సాగిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Ba Ba Black Sheep | సెంటిమెంట్ అనేది మనుషుల ఆలోచనల కంటే కొన్నిసార్లు ఎక్కువగా పనిచేస్తుందనే సరికొత్త పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.
చిత్రం: బా బా బ్లాక్ షీప్
నటీనటులు: అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్, ఉపేంద్ర లిమాయె, విస్మయ శ్రీ, మాల్వీ మల్హోత్రా, రాజా రవీంద్ర, శుభలేఖ సుధాకర్, టిను ఆనంద్ తదితరులు
దర్శకత్వం: గుణి మంచికంటి
నిర్మాత: వేణు దోనేపూడి
బ్యానర్: చిత్రాలయం స్టూడియోస్
రేటింగ్: 3
కథ
సెంటిమెంట్ అనేది మనుషుల ఆలోచనల కంటే కొన్నిసార్లు ఎక్కువగా పనిచేస్తుందనే సరికొత్త పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను దక్కించుకోవడానికి ఇద్దరు ప్రముఖ వ్యాపారవేత్తలు పోటీపడతారు. వారిలో ఒకరు కీలకమైన పెద్ద మనిషిని సెంటిమెంట్ ద్వారా తన వైపునకు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తాడు. దీనికోసం స్వాతంత్ర్య సమయం నాటి ఒక అరుదైన వస్తువును గిఫ్ట్‌గా ఇవ్వాలని భావించి, ఆ బాధ్యతను గ్యాంగ్‌స్టర్ జాన్ (ఉపేంద్ర లిమాయె)కు అప్పగిస్తాడు. మరోవైపు, మేఘాలయాలో సత్యనారాయణ అలియాస్ సత్తిపండు (విష్ణు ఓయ్) తన ప్రేయసి మేరి వివాహ వేడుకలో బిజీగా ఉంటాడు. ఈ పెళ్లికి వచ్చిన సత్తిపండు స్నేహితుడు సందీప్ (అక్షయ్ లగుసాని), అనుకోని పరిస్థితుల్లో ఒక కారు యాక్సిడెంట్ తర్వాత అక్కడ దొరికిన మిస్టరీ బాక్స్‌ను తీసుకుని వెళ్లిపోతాడు. ఆ బాక్స్ కోసం గ్యాంగ్‌స్టర్ జాన్ ఎంట్రీ ఇచ్చి, సత్తిపండును కిడ్నాప్ చేస్తాడు. అసలు ఆ బాక్స్‌లో ఏముంది? స్నేహితుడిని కాపాడుకోవడానికి సందీప్ ఏం చేశాడు? చివరికి ఈ క్రైమ్ డ్రామా ఎలా ముగిసింది? అనేదే ఈ చిత్ర అసలు కథ.
విశ్లేషణ
యువ దర్శకుడు గుణి మంచికంటి ఎంచుకున్న క్రైమ్ కామెడీ జోనర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా ఇలాంటి కథలను నగరాలు లేదా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తుంటారు, కానీ దర్శకుడు ఎంటైర్ సినిమాను మేఘాలయా అందమైన లొకేషన్లలో తెరకెక్కించి సరికొత్త అనుభూతిని పంచారు. మేఘాలయాలో పూర్తిగా షూటింగ్ జరుపుకున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ చిత్రంగా ఇది నిలవడం విశేషం. సినిమా ప్రథమార్థం ఎంతో వేగంగా, సరదాగా సాగుతుంది. పాత్రల పరిచయం, ఆ తర్వాత జరిగే గందరగోళ పరిస్థితులు ప్రేక్షకులను నవ్విస్తాయి. ఇక ద్వితీయార్థంలో వచ్చే ట్విస్టులు, కిడ్నాప్ డ్రామా కథను మరోస్థాయికి తీసుకెళ్తాయి. క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ మరియు దానికి కొనసాగింపు ఉంటుందనే సంకేతం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. కొన్ని చోట్ల పాత్రలు ఎక్కువగా కనిపించడం వల్ల కాస్త రద్దీగా అనిపించినా, ఓవరాల్‌గా బోర్ కొట్టకుండా సాగుతుంది.
సాంకేతికంగా
ఈ చిత్రానికి నిర్మాత వేణు దోనేపూడి అందించిన సపోర్ట్ స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. తక్కువ బడ్జెట్లోనూ విజువల్స్ చాలా రిచ్‌గా వచ్చాయి. అజయ్ అబ్రహం జార్జ్ సినిమాటోగ్రఫీ మేఘాలయా ప్రకృతి అందాలను అద్భుతంగా ఆవిష్కరించింది. ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ అందించిన పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ఎస్సెట్. ముఖ్యంగా ‘సమయమే ఇంద్రజాలం’, ‘అజా మేరి జాన్’ పాటలు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు సినిమా స్థాయిని పెంచాయి.
నటీనటుల నటన
అక్షయ్ లగుసాని చాలా ఎనర్జిటిక్‌గా నటించి, తన డ్యాన్సులు మరియు నటనతో ఆకట్టుకున్నాడు. సత్తిపండు పాత్రలో విష్ణు ఓయ్ కామెడీ టైమింగ్ సినిమాకి హైలైట్. ఆయన డైలాగ్ డెలివరీ నవ్వులు పూయిస్తుంది. ‘యానిమల్’ ఉపేంద్ర లిమాయె మరోసారి గ్యాంగ్‌స్టర్ పాత్రలో తనదైన విలక్షణ నటనతో అదరగొట్టారు. హీరోయిన్ విస్మయ శ్రీ, మాల్వీ మల్హోత్రా తమ పరిధి మేరకు చక్కగా నటించారు. రాజా రవీంద్ర, శుభలేఖ సుధాకర్ వంటి సీనియర్ నటులు తమ అనుభవంతో పాత్రలకు ప్రాణం పోశారు.
చివరిగా.. కొత్తదనం నిండిన లొకేషన్లు, మంచి కామెడీ టైమింగ్, ఆసక్తికరమైన క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. వీకెండ్లో సరదాగా కుటుంబంసమేతంగా లేదా స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇదొక మంచి ఎంటర్టైనింగ్ క్రైమ్ కామెడీ సినిమా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

