Ayalaan Movie | సంక్రాంతి రేసులోకి తమిళ సినిమా.. తెలుగు సినిమాల పోటీని తట్టుకుంటుందా?
Ayalaan Movie | ఎంత కాదన్నా సంక్రాంతి పండుగకు రిలీజయ్యే సినిమాలు టాక్‌తో సంబంధంలేకుండా కోట్లు కొల్లగొడుతుంటాయి. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న వీరసింహా రెడ్డి సైతం వంద కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది.
Ayalaan Movie | ఎంత కాదన్నా సంక్రాంతి పండుగకు రిలీజయ్యే సినిమాలు టాక్‌తో సంబంధంలేకుండా కోట్లు కొల్లగొడుతుంటాయి. ఈ ఏడాది అది రుజువైంది కూడా. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న వీరసింహా రెడ్డి సైతం వంద కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక యావరేజ్ టాక్‌ను తెచ్చుకున్న వీరయ్య ఏకంగా రెండొందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి చిరుకు తిరుగులేని కంబ్యాక్ అయింది. తెగింపు, వారసుడు వంటి డబ్బింగ్ సినిమాలు సైతం బయ్యర్లను సేఫ్ లైన్లోనే నిలబెట్టాయి. నిజానికి ఈ నాలుగు సినిమాలకు రిలీజ్ డేన మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఓవరాల్‌గా దాదాపు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్ల కురిపించి.. సంక్రాంతిని సినిమా పండగ అని కూడా ఎందుకంటారో అని మరోసారి నిరూపించాయి.
ఇక వచ్చే సంక్రాంతికి కూడా రసవత్తర పోటి సిద్ధమైంది. మూడ్నెళ్లకు పైగా టైమ్ ఉన్న సంక్రాంతిపై ఇప్పటి నుంచే స్లాట్లు బుక్ అవుతున్నాయి. ఇప్పటికే మా సినిమా అంటే మా సినిమా అని నాలుగైదు తెలుగు సినిమాలు సంక్రాంతి కోసం కొట్టుకు చస్తుంటే ఇప్పుడు ఓ అరవ సినిమా కూడా సంక్రాంతికే వస్తుందని అఫీషియల్ అప్డేట్ వచ్చింది. ఈ మధ్యనే మహావీరుడుతో తెలుగులో మంచి హిట్టు కొట్టిన శివ కార్తికేయన్ ఇప్పుడు అయాలన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. సై-ఫై కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా సీ.జీ పనుల్లో బిజీగా ఉన్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా వదిలారు. ఏలియన్ షిప్ నుంచి ఏలియన్ కిందకి పడుతున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌తోనే అంచనాలు హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లాయి. ఇక్కడ పెద్దగా ఈ సినిమాపై బజ్ లేదు కానీ.. తమిళనాట మాములు హైప్ లేదు. తొలిసారి హాలీవుడ్ రేంజ్ సినిమా వస్తుందని అక్కడి జనాలు అమితాసక్తితో ఉన్నారు. ఏర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 24AM స్టూడీయోస్ బ్యానర్‌పై ఆర్.డీ.రాజా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. శివ కార్తికేయన్‌కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.
ముందుగా సంక్రాంతి స్లాట్‌ను బుక్ చేసుకుంది గుంటూరు కారం సినిమా. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా వస్తుందని నాలుగు నెలల ముందే ప్రకటించారు. ఇక రవితేజ ఈగల్ కూడా సంక్రాంతినే టార్గెట్ చేసుకుంది. తేజా సజ్జా-ప్రశాంత్ వర్మల పాన్ ఇండియా మూవీ హనుమాన్ సంక్రాంతికే వస్తుంది. వీటితో పాటుగా నాగార్జున నా సామిరంగ కూడా అప్పుడే రానుందట. మరి ఇందులో ఎన్ని సినిమాలు సంక్రాంతికి రిలీజవుతాయో చూడాలి.
#AyalaanFromPongal #AyalaanFromSankranti 😊👍#Ayalaan 👽 pic.twitter.com/bbyf0PAoHP
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) September 23, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

