Shanmukha- Avikagore | ఆది సాయికుమార్ డివోషనల్ థ్రిల్లర్ షణుఖ్మలో శక్తివంతమైన పాత్రలో అవికాగోర్
Shanmukha- Avikagore | డివోషనల్ థ్రిల్లర్ సినిమా షణ్ముఖలో కథా నాయిక అవికాగోర్ సాహసోపేతమైన పాత్ర పోషిస్తున్నారని సినిమా దర్శకుడు షణ్ముఖం సాప్పని చెప్పారు.
Shanmukha- Avikagore | వైవిధ్యమైన చిత్రాలను, విభిన్నమైన కథలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఆ కోవలోనే రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ చిత్రం షణ్ముఖ. పవర్ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ కథానాయకుడు. అవికాగోర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన చివరి షెడ్యూల్‌తో ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న అవికాగోర్ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో ఆమె లుక్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా దర్శకుడు షణ్ముగం సాప్పని మాట్లాడుతూ.. `ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ ఇది. విజువల్ వండర్లా, అద్బుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో కథానాయిక అవికాగోర్ సర పాత్రలో సాహసోపేతమైన పనులు చేసే శక్తివంతమైన అమ్మాయి పాత్రలో కనిపించనుంది. లక్ష్య సాధనలో ఆది పాత్రకు సపోర్ట్ చేస్తూ ఆయనకు తోడుగా నిలిచే పాత్ర. తప్పకుండా ఆమె కెరీర్లో ఈ పాత్ర , సినిమా మరిచిపోలేని చిత్రంగా నిలిచిపోతుంది. ఈ చిత్రంలో అవికాగోర్ తన నటనతో అందరి హృదయాలను హత్తకుంటుంది. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రం కోసం ఎంతో రిచ్‌గా వేసిన ఓ సెట్లో చివరి షెడ్యూల్‌ను పూర్తిచేసాం` అని చెప్పారు.
`కేజీఎఫ్, సలార్ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బసూర్ ఈ చిత్రానికి స్టనింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం అత్యున్నత సాంకేతిక నిపుణులతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఓ వండర్ఫుల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ఆది కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుంది` అని షణ్ముగం సాప్పని అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

