Ayalaan Movie | శివకార్తికేయన్ సినిమాలో అవతార్ టెక్నీషియన్లు..!
'డాక్టర్', 'డాన్' వంటి వరుస హిట్లతో మంచి స్పీడ్‌లో దూసుకుపోతున్న శివకార్తికేయన్‌కు 'ప్రిన్స్' మూవీ బ్రేకులు వేసింది. కేవి. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇటీవలే ఓటీటీలో రిలీజై అక్కడ కూడా అంతగా రాణించలేదు.
Ayalaan Movie | ‘డాక్టర్’, ‘డాన్’ వంటి వరుస హిట్లతో మంచి స్పీడ్‌లో దూసుకుపోతున్న శివకార్తికేయన్‌కు ‘ప్రిన్స్’ మూవీ బ్రేకులు వేసింది. కేవి. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇటీవలే ఓటీటీలో రిలీజై అక్కడ కూడా అంతగా రాణించలేదు. ప్రస్తుతం ఆయన మూడు ప్రాజెక్ట్‌లను సెట్స్ మీద ఉంచాడు. అందులో ‘అయాలన్’ ఒకటి. సై-ఫై కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సీ.జీ వర్క్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని మేకర్స్ వెల్లడించారు.
ఈ సినిమాలో సీ.జీ వర్క్ ముఖ్య పాత్ర పోషిస్తుందట. దానికి కోసం మేకర్స్ భారీగా ఖర్చు పెడుతున్నారట. కాగా సీ.జీ వర్క్ కోసం అవతార్ సినిమాకు పని చేసిన టెక్నీషియన్లను రంగంలోకి దింపారట. ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. అవతార్ రేంజ్ టెక్నీషియన్లు ఈ మూవీకి పనిచేయనుండటంతో అటు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను 24AM స్టూడీయోస్ బ్యానర్‌పై ఆర్.డీ.రాజా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. శివ కార్తికేయన్‌కు జోడీగా రకుల్ ప్రీత్ నటిస్తోంది. ఏర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

