అట్లీ దర్శకత్వంలో..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ సౌత్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమిళ యువ దర్శకుడు అట్లీ కుమార్‌తో సినిమా చేసేందుకు సల్మాన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తున్నది. ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా స్టార్స్‌ను ఆకర్షిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ సౌత్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమిళ యువ దర్శకుడు అట్లీ కుమార్‌తో సినిమా చేసేందుకు సల్మాన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తున్నది. ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా స్టార్స్‌ను ఆకర్షిస్తున్నారు. ‘రాజా రాణి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అట్లీ…విజయ్ హీరోగా ‘తెరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. ఈ ట్రాక్ రికార్డ్‌తోనే షారుఖ్ ఖాన్‌తో సినిమా చేసే స్థాయికి ఎదిగారు. ఈ బాలీవుడ్ స్టార్‌తో అట్లీ రూపొందిస్తున్న ‘జవాన్’ సినిమా ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. ఇటీవలే చెన్నైలో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రం గురించి విన్న సల్మాన్‌ఖాన్ అట్లీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలో వీరి చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తున్నది. మరోవైపు విజయ్ హీరోగా అట్లీ మరో సినిమా చేయాల్సిఉంది. తెలుగులోనూ ఎన్టీఆర్ హీరోగా అట్లీ ఓ చిత్రానికి అంగీకారం కుదుర్చుకున్నారు. వీటన్నింటి ముందుగా సల్మాన్ ప్రాజెక్ట్ వస్తుందా అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

