#Askangana | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) తన వ్యవహారశైలి తీరుతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఫొటోషూట్లతో అలరిస్తుంటుంది. ఈ అమ్మడు సోమవారం ట్విట్టర్లో ఆస్క్ కంగనా (#Askangana) సెషన్‌ను సెషన్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది. ఆమె వ్యక్తిగత జీవితం నుంచి సినిమాల వరకు పలువురు ప్రశ్నలు సంధించగా.. వాటికి ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.
ఓ యూజర్ కంగనాను మహారాష్ట్ర రాజకీయాలపై ప్రశ్నిస్తూ.. ‘ఉద్ధవ్ ఠాక్రే.. సంజయ్ రౌత్ పరిస్థితిని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అనగా.. దీనికి కంగనా స్పందిస్తూ.. ఎదుటవారి పతనాన్ని చూసి సరైందని భావించొద్దని, నీచమైన వ్యక్తులే అలా భావిస్తారన్న కంగన తాను అలాంటి వ్యక్తినని కాదని చెప్పింది. వారు తమ కర్మఫలం పొందడం చూస్తున్నామని, నా భావోద్వేగాలు పక్కనపెట్టి చాలా విషయాలను గమనిస్తున్నాను అని చెప్పింది. ఈ సందర్భంగా మరో అభిమాని రాజకీయాల్లోకి ఎప్పుడు రాబోతున్నారని ప్రశ్నించగా.. ప్రస్తుతానికైతే తనకలాంటి ఆలోచన లేదని చెప్పింది.
సినిమాలపై దృష్టి పెట్టినట్లు చెప్పింది. మరో అభిమాని ప్రేమ, సత్యం దీంట్లో దేన్ని ఎంచుకుంటారని ప్రశ్నించగా.. తాను సత్యాన్ని ఎన్నుకుంటానని, ఎందుకంటే ప్రేమే మనల్ని ఎంచుకుంటుంది తప్ప దాన్ని మనం ఎన్నుకోలేమని చెప్పింది. ప్రేమ సూర్య కిరణాలవంటిదని చెప్పింది. మరో యూజర్ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ప్రశ్నించగా.. సో సో స్వీట్ అని పేర్కొంది. ఇదిలా ఉండగా.. కంగనా తన చిన్ననాటి ఫొటోలను షేర్ చేస్తూ.. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. ఇదిలా ఉండగా.. కంగనా త్వరలో సర్వేష్ మేవారా ‘తేజస్’, అనురాగ్ బసు చిత్రం ‘ఇమ్లీ’లో కనిపించనున్నది.