Asin | మేము విడిపోలేదు.. విడాకుల రూమర్స్‌పై సీరియస్ అయిన గజిని బ్యూటీ
Asin | అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంతో టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైన ఆసిన్, ఆ తరువాత తెలుగు సినీ పరిశ్రమలో వన్ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకున్నారు. శివమణి, గజిని, ఘర్షణ వంటి చిత్రాలతో పాపులర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు ఆసిన్.
Asin | అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంతో టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైన ఆసిన్, ఆ తరువాత తెలుగు సినీ పరిశ్రమలో వన్ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకున్నారు. శివమణి, గజిని, ఘర్షణ వంటి చిత్రాలతో పాపులర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు ఆసిన్. ఆ తరుణంలోనే పారిశ్రామికవేత్త రాహుల్ శర్మను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు ఆమె. పెళ్లి తరువాత సినిమాలకు దూరమయ్యారు అసిన్.
అయితే తాజాగా ఆమె భర్తతో దిగిన ఫోటోలను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో తొలగించడంతో ఆమె భర్తతో విడాకులు తీసుకోనుందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆసిన్ స్పందించారు. ‘వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న తరుణంలో కొన్ని వార్తలు మాకు కనిపించాయి. వాటిని చూశాక, పెళ్లి కోసం ఇరు కుటుంబాలను, పెద్దలను ఒప్పించిన ఆనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నాం అంటూ వస్తోన్న వార్తలు నిరాధారమైన వార్తలు, ఇందులో ఎలాంటి నిజం లేదు. దయచేసి వార్తలు పబ్లిష్ చేసేటప్పుడు ఆలోచించండి. మా హాలీడేస్‌లో ఈ వార్తలకు సమయాన్ని కేటాయించినందుకు చింతిస్తున్నాం’ అని సోషల్ మీడియా వేదికగా తన స్పందనను పంచుకున్నారు ఆసిన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- asin
- divorce
- Rahul Sharma
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

