ఊహించలేని కొత్త పాయింట్‌తో..
అశ్విన్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వచ్చినవాడు గౌతమ్'. మామిడాల ఎం.ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. మెడికో థ్రిల్లర్ కథాంశమిది. గురువారం ఈ సినిమా టీజర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్, దర్శకుడు శైలేష్ కొలను విడుదల చేశారు.
అశ్విన్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వచ్చినవాడు గౌతమ్’. మామిడాల ఎం.ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. మెడికో థ్రిల్లర్ కథాంశమిది. గురువారం ఈ సినిమా టీజర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్, దర్శకుడు శైలేష్ కొలను విడుదల చేశారు. ‘ధర్మం దారి తప్పినప్పుడు, ఏ అవతారం రానప్పుడు, వచ్చినవాడు గౌతమ్..’ అంటూ హీరో మనోజ్ మంచు వాయిస్ ఓవర్‌తో మొదలైన టీజర్ ఆసక్తికరంగా సాగింది. హీరో అశ్విన్‌బాబు పవర్ఫుల్ రోల్లో కనిపించారు.
ఈ సందర్భంగా అశ్విన్‌బాబు మాట్లాడుతూ.. ఎవరూ ఊహించలేని కొత్త పాయింట్‌తో ఈ చిత్రాన్ని తీశామని, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే అంశాలుంటాయని అన్నారు. రొటీన్ యాక్షన్ ఎంటర్టైనర్స్కు భిన్నంగా ఉండే చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ సినిమాకు మంచి టీమ్ కుదిరిందని, సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందని నిర్మాత తెలిపారు. రియా సుమన్, అయేషాఖాన్, మురళీశర్మ, సచిన్‌ఖేడేకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎన్.బాల్‌రెడ్డి, సంగీతం: గౌర హరి, నిర్మాణ సంస్థ: అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మామిడాల ఎం.ఆర్.కృష్ణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

