Love Me Review | లవ్ మీ రివ్యూ : రొమాంటిక్ హారర్ అలరించిందా ?
Love Me Movie Review | ప్రేక్షకులని థియేటర్స్ లోకి తీసుకోచ్చేది ప్రమోషనల్ కంటెంట్. సినిమా టీజర్ ట్రైలర్ ఆకట్టునేలా ఉంటేనే ప్రేక్షకులు ద్రుష్టి థియేటర్స్ పై పడుతుంది. అలా ప్రేక్షకుల ద్రుష్టిని ఆకర్షించిన చిత్రం 'లవ్ మీ'.
Love Me Movie Review | ప్రేక్షకులని థియేటర్స్ లోకి తీసుకోచ్చేది ప్రమోషనల్ కంటెంట్. సినిమా టీజర్ ట్రైలర్ ఆకట్టునేలా ఉంటేనే ప్రేక్షకులు ద్రుష్టి థియేటర్స్ పై పడుతుంది. అలా ప్రేక్షకుల ద్రుష్టిని ఆకర్షించిన చిత్రం ‘లవ్ మీ’. ఇఫ్ యు డేర్.. అనే క్యాప్షన్ తో రూపొందిన ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ క్యురియాసిటీ పెంచింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్రాండ్ తో రావడం, ముఖ్యంగా రోమాన్స్ ని హారర్ తో మిక్స్ చేసిన జోనర్ యూనిక్ గా వుండటంతో లవ్ మీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. మరీ ఆసక్తిని అందుకునేలా లవ్ మీ ఉందా ? రొమాంటిక్ సస్పెన్స్ హారర్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులు ఎలాంటి అనుభూతిని పంచిందో రివ్యూలో చూద్దాం.
కథ: అర్జున్ (ఆశిష్) లాజిక్ ని నమ్మే మనిషి. తనకి దెయ్యాలు, దేవుడు పై విశ్వాసం వుండదు. ఎక్కడైనా దెయ్యాలు వున్నాయని తెలిస్తే అక్కడికి వెళ్లి ఆధారాలతో సహా లేవని నిరూపించడం అతడి పని. అదే అంశంపై యూట్యూబ్ చానల్ ని నడుపుతుంటాడు. అలాంటి అర్జున్ కి ప్రియ(వైష్ణవి చైతన్య ) ద్వారా దివ్యవతి అనే ఓ దెయ్యం గురించి తెలుస్తుంది. దివ్యవతిని ఎవరైనా ఒక్కసారే చూడగలరు. రెండోసారి చూసిన వారు ఇంక మిగలరనిన ప్రచారంలో వుటుంది. దివ్యవతి సంగతి తేల్చడానికి తను వుండే భవంతిలోకి వెళ్తాడు అర్జున్. తర్వాత ఏమయింది ? అర్జున్‌కి దివ్యవతి కనిపించిందా లేదా? ఆ ప్రయాణంలో దివ్యవతి గురించి తనకు తెలిసిన నిజాలేంటి? ఇంతకీ దివ్యవతి ఎవరు ? అనేది తక్కిన కథ.
విశ్లేషణ: ఒక యూనిక్ పాయింట్ తో అల్లుకున్న రొమాంటిక్ హారర్ స్టొరీ ఇది. నిజానికి ఇది కొత్త పాయింటే. అలాగే తెరపై కన్వెన్స్ చేయడానికి కష్టమైన పాయింట్ కూడా. దెయ్యంతో ప్రేమలో పడటం అంటే వినడానికే లాజిక్ కి దూరంగా వుంది. అలాంటి పాయింట్ ని ప్రేక్షకులని అలరించేలా హారర్ లో రొమాంటిక్ ఎలిమెంట్స్ ని కూడా చొప్పిస్తూ ఎంటర్ టైనింగ్ గా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. అర్జున్ చిన్నప్పుడు ఊర్లో జరిగిన ఓ మిస్టరీ ఎపిసోడ్ తో కథ మొదలౌతుంది. తర్వాత అర్జున్ పరిచయ సన్నివేశాలు ఆసక్తికరంగా వుంటాయి. దివ్యవతి కథ తెరపైకి రావడంతో కథనం ఇంకాస్త రక్తికడుతుంది. దివ్యవతి వరల్డ్ బిల్డింగ్, తన నేపధ్యం థ్రిల్ ఇస్తాయి.
సెకెండ్ హాఫ్ లో ఈ కథ నేర విచారణ కోణంలో నడుస్తుంది. మిస్సింగ్ అమ్మాయిల కేసుని తెరపై రావడం, తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు కాస్త గంధరగోళంగా అనిపిస్తాయి. అయితే మిస్సింగ్ కేసుకి దివ్యవతి కి ముడిపెట్టడం బావుంది. ప్రియ పాత్రలో ట్విస్ట్ కూడా అలరించేలానే ఉటుంది. క్లైమాక్స్ ని తీర్చిద్దిన తీరు సంతృప్తి కరంగానే వుంటుంది. దీనికి పార్ట్ 2 కోసం పెట్టిన క్లిప్ హ్యాంగర్ కూడా బాగా కుదిరింది.
నటీనటులు: నటనపరంగా ఆద్యంతం ఆకట్టుకుంటాడు ఆశిష్. సీరియస్ గా సాగే పాత్ర తనది. రెండో సినిమాకే చాలా పరిణితి సాధించాడు. తన నటనలో చాల ఈజ్ కనిపిస్తోంది. ప్రియ పాత్రలో కనిపించిన వైష్ణవి అందంగా వుంది. తన పాత్రలో బేబీ ఛాయలు కనిపిస్తాయి. రవికృష్ణ పాత్ర డీసెంట్ గా వుంది. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
సాంకేతికంగా : టెక్నికల్ గా సినిమా టాప్ క్లాస్ లో వుంది. కీరవాణి నేపధ్య సంగీతం ప్రధాన ఆకర్షణ. చాలా సన్నివేశాలని ఆయన బీజిఎం ఎలివేట్ చేస్తుంది. పీసి శ్రీరాం కెమరా పనితనం కట్టిపడేస్తుంది. ఆయన మార్క్ ఫ్రేములు అలరిస్తాయి. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ డీసెంట్ గా వున్నాయి. నిర్మాణంలో రాజీపడలేదు
ప్లస్ పాయింట్స్ : యూనిక్ కాన్సెప్ట్, సస్పెన్స్ హారర్ ఎలిమెంట్స్, ఆశిష్, వైష్ణవి నటన, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్: అక్కడక్కడా నెమ్మదించిన కథనం, సెకండ్ హాఫ్ లో కొంత గందర గోళం
రేటింగ్: 3/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

