Love Me | లవ్ మీలో ఆరుగురు హీరోయిన్లు.. ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన ఆశిష్
Love Me | టాలీవుడ్ యాక్టర్ ఆశిష్ (Ashish) కాంపౌండ్ నుంచి వస్తోన్న హార్రర్ లవ్ థ్రిల్లర్ ‘లవ్మీ’ (Love Me Trailer). ‘ఇఫ్ యు డేర్’ ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న లవ్ మీ మే 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Love Me | టాలీవుడ్ యాక్టర్ ఆశిష్ (Ashish) కాంపౌండ్ నుంచి వస్తోన్న హార్రర్ లవ్ థ్రిల్లర్ ‘లవ్మీ’ (Love Me Trailer). ‘ఇఫ్ యు డేర్’ ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. బేబి ఫేం వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తుండగా.. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్ మీ మే 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రంలో కథానుగుణంగా దెయ్యం పాత్ర ఉండగా.. ఆ రోల్ ఎవరు పోషించారనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టారు మేకర్స్. ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని అడుగగా ఆశిష్ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. సినిమాలో ఐదుగురు హీరోయిన్లున్నారు. ఇప్పటివరకు మేం ఏ విషయాన్ని కూడా బయట పెట్టలేదు. ప్రేక్షకులు బిగ్ స్క్రీన్‌పై ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. వైష్ణవి చైతన్య మెయిన్ హీరోయిన్. మిగిలిన హీరోయిన్లు కథలో భాగంగా వస్తుంటారు. సినిమాల్లో వాస్తవంగా ఆరుగురు హీరోయిన్లున్నారంటూ చెప్పుకొచ్చాడు.
ఓ కుర్రాడు దెయ్యాన్ని ప్రేమించాలనుకుంటే ఎలా ఉంటుంది..? ఏమవుతుంది..? అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ మూవీ ట్రైలర్‌ను ఇటీవలే లాంఛ్ చేశారు మేకర్స్. తనని చూస్తే నన్ను చంపేస్తుందేమో అని మీరు భయపడుతున్నారు..నన్ను చూశాక చంపకుండా వదిలేస్తుందేమో అని నేను భయపడ్తున్నాను.. అనే డైలాగ్స్‌తో సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ కెమెరామెన్ కాగా.. లెజెండీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
లవ్ మీ ట్రైలర్..
లవ్ మీ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

